Private Jet Crash : ట్రంప్ నివాసానికి దగ్గరలో ఘోర విమాన ప్రమాదం.. 9మంది సజీవ దహనం.. పైలట్‌ చివరి మాటలివే!

Florida Private Jet Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ జెట్ అదుపు తప్పి నేరుగా జనావాసాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

Florida Private Jet Crash

Florida Private Jet Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్లోరిడా రాష్ట్రంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్ ‘మార్-ఎ-లాగో’కు కొద్దిదూరంలో బిజినెస్ జెట్ అదుపు తప్పి కుప్పకూలింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డుపై కూలిపోవడంతో క్షణాల్లోనే భారీ మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు, సమీపంలోని ఇళ్లకు అతి దగ్గరలో విమానం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం కూలిన ప్రాంతంలో రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది.

Also Read : Cyclone Murasu : మురసు తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రంలో పామ్ బీచ్ కౌంటీలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ జెట్ బహామాస్ దీవులకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదంకు ముందు 8వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుంది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారినట్లు కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు వెలుగులోకి వచ్చాయి.

పైలట్ తొలుత విమానంపై మంచు పేరుకుపోయిందని చెప్పినట్లు వినిపించింది. తొలుత నిమిషానికి 10వేల అడుగుల వేగంతో కిందకు దూసుకొచ్చిన విమానం.. ఆ తరువాత నిమిషానికి 20వేల అడుగులు.. చివరకు 30వేల అడుగుల వరకు కిందకు దూసుకొచ్చినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్స్, ప్లైట్ ట్రాకింగ్ సమాచారం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. సిబ్బంది మేడే కాల్ పంపాడు. మేడే.. మేడే.. అంటూ సహాయం కోరాడు. విమానం వేగంగా కిందికి దూసుకొస్తుంది.. నేలను ఢీకొట్టబోతున్నామని చవరిగా హెచ్చరించినట్లు రేడియో సంభాషణల్లో వెల్లడైంది. ఆ తరువాత సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం రాకెట్ వేగంతో దూసుకొచ్చి నేలను ఢీకొట్టిన వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో విమాన శకలాలు, రోడ్డుపై ధ్వంసమైన భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటి చుట్టూ మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. విమాన ప్రమాదం ఇళ్లకు, కార్లకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘోర విమాన ప్రమాదం కారణంగా.. విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించగా.. నేలపై ఎలాంటి మరణాలు సంభవించలేదని.. స్వల్ప ఆస్తినష్టం సంభవించిందని ప్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిన్ తెలిపారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. విమానం కూలిపోవడానికి మంచు పేరుకుపోవడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు కారణమా? లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా? అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.