Joe Biden : యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌కు కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో పాల్గొనేందుకు జో బిడెన్ భారతదేశ పర్యటనకు ముందు అతిని భార్య, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కొవిడ్ బారిన పడ్డారు. అమెరికా దేశంలో మళ్లీ కొవిడ్ -19 కొత్త వేరియెంట్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో జో బిడెన్ కు కొవిడ్ -19 కొత్త వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు కెవిన్ ఓ కానర్ సిఫార్సు చేశారు.

World Bank : సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

అమెరికా దేశంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారంతా రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను తీసుకోవాలని యూఎస్ అధికారులు సిఫార్సు చేశారు. దీంతో జో బిడెన్ తాజాగా కొవిడ్ కొత్త వ్యాక్సిన్ తీసుకున్నారు. (Joe Biden Gets An Updated Covid-19 Vaccine) అమెరికన్ ప్రజలు యూఎస్ అధ్యక్షుడి చర్యను అనుసరిస్తూ అందరూ వ్యాక్సిన్ తీసుకుంటారని భావిస్తున్నట్లు ప్రెసిడెంట్ వ్యక్తిగత వైద్యుడు కెవిన్ చెప్పారు.

Sharad Pawar : గుజరాత్‌లో లాక్టోఫెర్రిన్ ప్లాంట్‌‌కు శరద్ పవార్ ప్రారంభోత్సవం

గత వారం ఫైజర్, మోడెర్నా కంపెనీలు యాంటీ కొవిడ్-19 కొత్త వ్యాక్సిన్ ను విడుదల చేశాయి. దీంతో అమెరికా దేశంలోని 60 ఏళ్లకు పైబడిన వారందరూ ఈ కొత్త కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు