United States President Joe Biden : దోబూచులాడిన అమెరికా అధ్యక్ష సింహాసనం బైడెన్ నే వరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ సంచలనం విజయం సాధించాడు. 284 సీట్లలో బైడెన్ గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. డొనాల్డ్ ట్రంప్ 214 సీట్లకే పరిమితమయ్యారు. 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలుపొందారు. దక్షిణాసియా నుంచి అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ రికార్డు సాధించారు.
జోబైడెన్ మొట్టమొదటి సారి డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2009 నుంచి 2017వరకు బరాక్ ఒబామా పాలనలో 47 వ వైస్ ప్రెసిడెంట్ గా బైడెన్ సేవలు అందించారు. అంతేకాకుండా 1973 నుంచి 2009 వరకు డెలావార్ సెనెటర్ గా ఆయన సుదీర్ఘ కాలం కొనసాగారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అత్యధిక ఓట్ల మెజారిటీతో 46 వ అధ్యక్షుడిగా సంచలన విజయం సాధించాడు.
ఇప్పటివరకు ఏ అధ్యక్షుడికి కూడా అన్ని ఓట్లు రానంతగా బైడెన్ పట్టం కట్టారు. రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ పై బైడెన్ భారీ విజయాన్ని సాధించారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు సాధించి 270 మార్క్ దాటారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆఖరి వరకు ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నా సందర్భంలో కూడా ఓటింగ్ జరిగింది. రెండు వర్గాల నుంచి నిరసన ర్యాలీలు జరిగాయి.
ఒకవైపు ట్రంప్ ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆఖరి ఓటు లెక్క తేలేవరకు ఎవరూ ఆందోళన చెందవద్దంటూ దేశ ప్రజానికాన్ని ఉద్దేశించి ఇరువురు కూడా రిపబ్లిక్ అభ్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి మాట్లాడారు. ముఖ్యంగా కోవిడ్ ఎఫెక్ట్ ట్రంప్ కు సోకడంతోపాటు ఎన్నికల విషయంలో కూడా గట్టి షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. కోవిడ్ ఎదుర్కొనే విషయంలో ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు, రిపబ్లికన్లు ప్రచారం విషయంలో కూడా నెమ్మదిగా ఉన్న బైడెన్ ..చాపకింద నీరులా అమెరికా వ్యాప్తంగా విజయాన్ని సాధించాడు. గతంలో యునైటెడ్ స్టేట్స్ లో ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా ట్రంప్ కు చుక్కెదురుగా బైడెన్ నిలిచారు.
ప్రపంచ దేశాల అధ్యక్షుళ్లు, అధినేతలు బైడెన్ కు అభినందలు తెలియజేస్తున్నారు. బైడెన్ గెలవాలని ఆకాక్షించిన అనేక దేశాల వారు ఉన్నారు. ముఖ్యంగా అనేక దేశాల వారు ట్రంప్ వ్యవహార శైలి నచ్చని వారున్నారు. కానీ గట్టి పోటీ ఇచ్చారని చాలా దేశాల అధినేతలు ఒప్పుకుంటున్నారు.కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్స్ సంబంధించిన అభ్యర్థి జో బైడెన్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. దురాక్రమణదారులు వైట్ హౌస్ ను ఖాళీ చేయాలన్న అంశాలను ఇవాళ ఆయన మాట్లాడారు.