రిపోర్టర్స్ ఎన్నో విషయాలన్ని ప్రపంచానికి చెబుతారు. పలు అంశాలపై ఎటువంటి అవగాహన పెంచుకోవాలో కూడా చెబుతారు. అలా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్ పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తోంది ఓ మహిళా జర్నలిస్టు.
దీంట్లో భాగంగా ఆమె ఓ పామును మెడలో వేసుకుని రిపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో ఆ పాము బుసలు కొట్టింది. దీంతో భయంతో గజ గజా వణికిపోయింది.. అలా ఒకసారికాదు మూడు సార్లు జరిగింది. ఆ సమయంలో ఆమె భయపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో జరిగింది ఈ ఘటన. మహిళా జర్నలిస్టు పట్టుకున్న మైకుపై ఆ పాము కాటు వేసినంత పని చేసింది. ఈసందర్భంగా ఆ రిపోర్టర్ తాను ఆ సమయంలో పడిన భయాన్ని తెలుపుతూ.. నేను పట్టుకున్న మైకుపై పాము కాటువేసినంత పని చేసింది. బుస్ బుస్ మంటూ ఆ పాము చేసిన సౌండ్ కు నా వెన్నులో వణుకు వచ్చేసింది. మైక్ దగ్గరలోనే నా చేయి ఉంది. దీంతో నేను చాలా భయపడి పోయాను’ అని ఆ మహిళా జర్నలిస్టు తన అనుభవాన్ని తెలిపింది. ఒక వేళ ఆ పాము తన చేతిపై కాటు వేస్తే ఏం జరిగి ఉండేది? అంటూ వణికిన గొంతుతో చెప్పింది.
An Australian reporter screamed after a snake draped around her shoulders repeatedly struck at her microphone ?
For more world news, head here: https://t.co/ykoGZFWgr8 pic.twitter.com/Npm6uYMG5i
— Sky News (@SkyNews) February 6, 2020