Helicopter Crash : అయ్యో.. బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కుప్పకూలిన హెలికాప్టర్.. పలువురు మృతి

Los Angeles Helicopter Crash : అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.

Los Angeles Helicopter Crash

Los Angeles Helicopter Crash : అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదాన్ని గగనతలం నుంచి కవర్ చేస్తున్న ఓ మీడియా హౌస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన లాస్ ఏంజెల్స్ లోని చాట్స్‌వర్త్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం సమయంలో చోటు చేసుకుంది.

Also Read : China Slams US Weapons in Space : అమెరికాకు వార్నింగ్.. స్పేస్‌లో ఆయుధాల మోహరింపుపై చైనా తీవ్ర ఆగ్రహం..

హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతానికి సమీపంలో ఓ ఎస్‌యూవీ, మెట్రో బస్సు ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు పలువురు మీడియా సిబ్బంది హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకొని వీడియో షూట్ చేస్తున్నారు. ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని నాలుగు వాహనాలు, రెండు స్టోరేజ్ కంటైనర్లకు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మృతుల్లో ఒకరు హెలికాప్టర్‌లోని వ్యక్తి కాగా.. మరొకరు పార్కింగ్ ప్రాంతంలో ఉన్న పాదచారి అని లాస్ ఏంజెల్స్ అగ్నిమాపక విభాగం తెలిపింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారు..? ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు చేపట్టనున్నాయి. ఒకే ప్రాంతంలో కొద్ది గంటల వ్యవధిలో రోడ్డు ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

హెలికాప్టర్‌లోని కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలో మొదట బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం కనిపిస్తోంది. అనంతరం హెలికాప్టర్ ఒక్కసారిగా కిందకు దిగుతున్నట్లు, కెమెరా తీవ్రంగా కదులుతున్నట్లు కనిపించింది.