Man Stunned To See A Ship Floating In The Air
Ship floating in the Air: ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్ తీర ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఓ వింతను చూశాడు. వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇంటర్నేషనల్ గా వైరల్ అయింది. అదేంటో తెలుసా.. గాలిలో షిప్ ప్రయాణిస్తుంది. ఎక్కడైనా షిప్ నీటిమీద తేలుతుంది కానీ ఆ షిప్ గాలిలో కనిపించడం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది.
దీనిని ఆప్టికల్ ఇల్యూజన్ దృక్కోణంలో భ్రమ అని అంటున్నారు నిపుణులు. దీనిని ఎండమావి ప్రభావం అంటున్నారు. అలాంటి భ్రమలు ఆర్కిటిక్ సముద్రంలో కనిపించడం సర్వ సాధారణం. ఇవి లండన్ లో కూడా వాతావరణ పరిస్థితులను బట్టి కనిపిస్తుంటాయి. కాకపోతే చాలా అరుదుగా.
మెటరలాజికల్ చెప్పిన దానిని బట్టి ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులను బట్టి ఇటువంటి భ్రమలు కనిపించొచ్చు. సాధారణంగా ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. వాటి ద్వారా పర్వతాలపైన చల్లగా ఉండటం, కింది భాగంలో వెచ్చగా ఉండటం జరుగుతుంటాయి. కానీ, ఉష్ణోగ్రత వక్రీభవనం కారణంగా వేడి గాలి చలిగాలిపైకి చేరుతుంది.
Walker ‘stunned’ to see ship hovering high above sea off Cornwall https://t.co/oWx6YnLvOR
— The Guardian (@guardian) March 5, 2021
అదే దృక్కోణం మారేలా చేస్తుంది. అది సముద్రాలపై ఉండే చల్లని గాలి, వేడి గాలి బేధాల వల్ల కలుగుతుంది. ఎందుకంటే వేడి గాలి కంటే చల్ల గాలికి సాంద్రత తక్కువ. పైగా దానికి వక్రీభవనం కోణం ఎక్కువ. అందుకే గాలిలో షిప్ ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది. షిప్ పైన పడిన కాంతి కిరణాలు వంగి చల్లగాలి మీదుగా ప్రయణించడంతో ఇమేజ్ అలా కనిపిస్తుంది.
అలా జరగడం వల్ల మానవ మెదడు త్వరగా మోసపోతుంది. కాంతి కిరణాలు నేరుగా ప్రయాణిస్తున్నాయని చూస్తే పొరబాటుగానే కనిపించొచ్చు. దీంతో షిప్ లు ఉండే ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులోనే కనిపిస్తుంటాయి.