Special Marriage : పెళ్లికి వచ్చిన మాజీ ప్రియురాలు.. ఇద్దరికీ తాళి కట్టిన వరుడు
ప్రియుడి పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియురాలు, పెళ్లి వేదిక వద్దకు వచ్చి తనను కూడా పెళ్లి చేసుకోవాలని వరుడిని కోరింది. ఈ ఘటన ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఊహించని పరిణామంతో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కంగుతున్నారు.
- kunduru Vinod
- Published On : August 5, 2021 / 07:13 PM IST
Special Marriage
Special Marriage : ప్రియుడి పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియురాలు, పెళ్లి వేదిక వద్దకు వచ్చి తనను కూడా పెళ్లి చేసుకోవాలని వరుడిని కోరింది. ఈ ఘటన ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఊహించని పరిణామంతో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కంగుతున్నారు. వివరాల్లోకి వెళితే కొరిక్ అక్బర్ (20) అనే యువకుడికి కుష్మల్ కొతిమా (20)తో వివాహం నిశ్చయించారు పెద్దలు. ఇక వరుడి స్నేహితులు శుభాకాంక్షలు చెబుతూ అక్బర్, అతడికి కాబోయే యువతి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలను చూసిన మాజీ ప్రియురాలు యునిత రూరి (21) పెండ్లి వేడుక వద్దకు వచ్చింది. తనను కూడా పెళ్లి చేసుకోవాలని అక్బర్ ని కోరింది. యునిత రూరి మాటలు విన్న వధూవరుల కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇక ఇదే సమయంలో యువతితో ఉన్న సంబంధాన్ని వరుడు బయటపెట్టాడు. దీంతో ఇద్దరినీ ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు.
ఇక పెళ్లి సమయంలో ఇరువురు భార్యలకు రూ.8980 సమర్పించుకున్నాడు అక్బర్. కాగా అక్బర్ లో ఉద్యోగం కూడా లేదు.. ఇద్దరు భార్యలను ఎలా పోషించాలో దిక్కుతోచడం లేదని వాపోతున్నాడు.
