UAE Iran Deal 2026 : అమెరికాకు షాకిచ్చిన యూఏఈ..! ఇరాన్‌కు విమానాలు, డబ్బు, టన్నుల కొద్దీ బంగారం.. అసలు కారణమిదే?
UAE Iran Deal 2026 : అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
UAE Iran Deal 2026
UAE Iran Deal 2026 : అమెరికా – ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు బిగ్ షాకిస్తూ.. ఇరాన్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఇరాన్ కు విమానాలతోపాటు.. భారీగా నగదు.. టన్నుల కొద్దీ బంగారంను తరలించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
అమెరికా సైన్యం ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ సైతం అందుకు తగ్గట్టుగానే దాడులతో దీటుగా సమాధానం ఇస్తోంది. అమెరి ఇరాన్‌పై దాడులు చేస్తుంటే.. ఇరాన్ యూఏఈలోని అమెరికా స్థావరాలు, కీలక ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. అది అమలు కావడం లేదు. దీంతో ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఇక మీదట తాము ఇలా టార్గెట్ కాకూడదని యోచిస్తున్న యూఏఈ ఇరాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాల్లోని బ్యాంకుల వద్ద ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. అలా తమ వద్ద ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేసి యుద్ధానికి దూరంగా ఉండాలని యూఏఈ నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈనెల 11, 12 తేదీల్లో ఆ దేశానికి విమానాలతోపాటు డబ్బులు, భారీగా బంగారం తరలించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలోని కొన్ని సంస్థల ద్వారా ఇరాన్ విమానయాన సంస్థలకు ఇప్పటికే ఉపయోగించిన దాదాపు 15 సెకండ్ హ్యాండ్ విమానాలను విక్రయించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
వీటిలో సెకండ్ హ్యాండ్ Saudia Boeing 777, అలాగే కొన్ని Boeing 737, Airbus A320 విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు Airbus A320 విమానాలు ఇరాన్‌కు చేరినట్లు పేర్కొంది. అవికాక మరో 14 ప్యాసింజర్ విమానాలను కూడా తిరిగి ఇరాన్‌కు ఇచ్చేందుకు యూఏఈ సిద్ధమైందని తెలుస్తోంది.
జూన్ 8న అబుదాబి నుంచి మెహ్రాబాద్కు ఓ విమానం వెళ్లిందని.. అందులో సుమారు మూడు బిలియన్ డాలర్లు ఆ దేశానికి బదిలీ అయినట్లు సమాచారం. అంతేకాక.. రెండు టన్నుల బంగారం కూడా ఇరాన్ కు ఇప్పటికే బదిలీ అయిందని తెలుస్తోంది.
సింపుల్‌గా చెప్పాలంటే యూఏఈకి ఇరాన్‌తో ప్రత్యక్ష ఘర్షణ వద్దు. అమెరికా–ఇరాన్ మధ్య పోరు మరింత పెరిగితే గల్ఫ్ ప్రాంతంలోని దేశాలు కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే యూఏఈ ఇరాన్‌తో సంబంధాలను నిర్వహిస్తూ, తన భద్రతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
