Author Alice Sebold : చేయని నేరానికి 16 ఏళ్ల పాటు జైలు శిక్ష

1982 సమయంలో జరిగిన ఈ కేసు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆంథోని బ్రాడ్‌వాటర్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.

Man Who Spent 16 Years In Prison : చేయని నేరానికి ఓ వ్యక్తి 16ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత కూడా బెయిల్‌పై విడుదలై కోర్టు చుట్టూ తిరిగాడు. చివరకు అతడు నిర్దోషి అని తేలింది. ఇప్పుడు అతడి వయస్సు 61ఏళ్లు. తనను కోర్టు నిర్దోషి అని తేల్చడంతో ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు తనకు పడ్డ శిక్షపై కన్నీరు కార్చాడు. ఈ ఘటన అమెరికాలోని ఒనోండగా కౌంటీలో చోటుచేసుకుంది.

Read More : తిరుపతిలో వింత ఘటన.. ట్యాంక్ భూమిపైకి ఎలా వచ్చిందబ్బా..?

1982లో ప్రముఖ రచయిత అలిస్ సెబోల్డ్‌పై అత్యాచారం జరిగింది. అయితే అతడిని ఆమె గుర్తు పట్టకుండా వేరే వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. దీంతో బ్రాడ్‌వాటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లేనిపోని సాక్ష్యాలతో 16 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఆ తర్వాత విడుదలైన అతను చేయని నేరానికి శిక్ష అనుభవించానని కుమిలిపోయాడు. కానీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అయినప్పటికీ అతడిపై అత్యాచారం చేశాడనే మచ్చ మాత్రం మిగిలిపోయింది.

Read More : AP Crime : పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన కొడుకు

అయితే తాజాగా 1982 సమయంలో జరిగిన ఈ కేసు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆంథోని బ్రాడ్‌వాటర్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఒనోండగా కౌంటీ జిల్లా అటార్నీ విలియం ఫిట్జ్‌పాట్రిక్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోర్డాన్ కఫీ ఈ కేసుపై విచారణ చేపట్టి బ్రాడ్‌వాటర్‌కు అప్పటి కోర్టు ప్రాసిక్యూషన్‌లో అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ సమయంలో 61 ఏళ్ల ఆంథోని బ్రాడ్‌వాటర్‌ కన్నీటి పర్యంతం అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు