Mandeep Kaur: న్యూజిలాండ్‌లో ఇండియాకు చెందిన మహిళా పోలీస్
ఇండియాకు చెందిన న్యూజిలాండ్ లో పోలీస్ ఆఫీసర్ అయింది. ఇటువంటి ఘనత సాధించిన తొలి మహిళ మన్దీప్ కౌర్..
- Subhan Ali Shaik
- Updated on- April 6, 2021 / 12:44 PM IST
Mandeep Kaur
Mandeep Kaur: ఇండియాకు చెందిన న్యూజిలాండ్ లో పోలీస్ ఆఫీసర్ అయింది. ఇటువంటి ఘనత సాధించిన తొలి మహిళా ఆఫీసర్ మన్దీప్ కౌర్ మాత్రమే. సీనియర్ సర్జెంట్ హోదాలో విధులు నిర్వర్తించేందుకు న్యూజిలాండ్ పోలీస్ కమిషనర్ ఆండ్రీ కాస్టర్ నుంచి బ్యాడ్జ్ అందుకున్నారు.
ఆమె 2004 నుంచి అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా ఎంతో మంది ఇండియన్లకు ఇన్స్పిరేషన్గా మారారు. వలస వ్యక్తిగా న్యూజిలాండ్ కు వచ్చిన కౌర్.. స్వస్థలం పంజాబ్ లోని మాల్వా. ఎప్పుడూ తనకు పోలీస్ కావాలనే ఉండేది.
అంతకంటే ముందు ఆస్ట్రేలియాలో కొంత కాలం ఉండి తర్వాత న్యూజిలాండ్ రావడమే కాక ఫస్ట్ ట్యాక్సీ డ్రైవర్ గానూ పనిచేశారు. రోడ్ పాలసింగ్, ఫ్యామిలీ వయోలెన్స్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్, పొరుగువారి భద్రత, కమ్యూనిటీ పాలసింగ్ లలో ఫ్రంట్ లైన్ ఆఫీసర్ గా పని పనిచేశారు. న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్ మెంట్లో మన్దీప్ కౌర్ కీలకమైన వ్యక్తి.
