Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
- Dharani Pilli
- Updated on- April 2, 2026 / 07:45 AM IST
Massive earthquake with 7 8 magnitude hits indonesia issue tsunami alert
Indonesia Earthquake : ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఈ ధాటికి పెద్ద పెద్ద భవనాలు కంపించాయి.. పగుళ్లు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. టెర్నెట్ ఐలాండ్‌కు 127 కిలోమీటర్ల దూరంలో.. మొలుక్కా సముద్రంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు.. యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే వెల్లడించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, భవనాలు వదిలి.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప ధాటికి చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగులకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
భూకంపం నేపథ్యంలో.. ఈ భూకంప కేంద్రానికి సుమారు 1000 కి.మీ. పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
