ఇండియా టూర్‌ను మర్చిపోలేకపోతున్న ట్రంప్, ఇకపై ఎంత మంది ప్రజల్ని చూసినా ఆశ్చర్యపడరంట

సౌత్ కరోలినా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ప్రధాని మోడీపై ‘గ్రేట్ గై'(great guy) అని పొగిడారు. వారం రోజుల క్రితం భారత పర్యటన చేసిన ట్రంప్ కోసం మోడీ భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారని పొగిడారు. మరోసారి భారత్‌లో పర్యటించినా అంతే జనం వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియంలో భారీ సంఖ్యలో జనం వచ్చారు. 

‘నేను భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉన్నాను. అతనొక గొప్ప మనిషి. భారతదేశమంతా అతణ్ని ప్రేమిస్తుంది. అక్కడ అద్భుతం జరిగింది. నేను వెళ్లినప్పుడు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. మామూలుగానే నా మీటింగ్ అంటే ఎవరికీ రానంత జనం వస్తారు. దాదాపు 60వేల మంది వరకూ చూసి ఉంటా’

‘మరోసారి భారత్ వెళ్లినా అంతే సంఖ్యలో జనం వస్తారనడంలో సందేహమే లేదు. 1.5బిలియన్ మంది ఉన్న దేశంలో మోడీపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇక్కడ 350మంది వచ్చినా బాగానే ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అలాగే అక్కడ ఉన్న జనాన్ని కూడా ప్రేమిస్తున్నాను. వాళ్లలో ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. దేశాన్ని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఇది చాలా విలువైన పర్యటన’ అని ట్రంప్ అన్నారు.

అమెరికా నుంచి వచ్చిన ట్రంప్‌ సబర్మతీ ఆశ్రమం, మోటేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ఈవెంట్, ఆగ్రాలోని తాజ్‌మహల్, రాష్ట్రపతి భవన్‌లో విందు, డిలిగేషన్ స్థాయి చర్చలకు అగ్రిమెంట్లతో పర్యటన పూర్తి అయింది.