శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా? ఏది ఆరోగ్యానికి మంచిది అంటే.. అధిక శాతం మంది శాఖాహారమంటారు. మాంసాహార ప్రియులేమో మాంసాహారమేని అంటుంటారు. వాస్తవానికి శాఖాహారం, మాంసాహారం రెండు ఆరోగ్యానికి ముఖ్యమైనవే. కానీ, ఈ కొత్త అధ్యయనాల ప్రకారం.. శాఖాహారుల (మాంసానికి తిననివారి) కంటే మాంసం తినేవారే మానసిక ఆరోగ్యంతో ఎక్కువగా ఉంటారని చెబుతున్నాయి. Critical Reviews in Food Science and Nutritionలో ప్రచురితమైన కొత్త పరిశోధనల ప్రకారం.. మాంసం తినని వారి కంటే మాంసం తినేవారిలోనే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనంలో అందుకు గల కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. శాకాహారుల్లో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, స్వీయ హాని కలిగించే ప్రమాదం ఉందని గుర్తించారు.
ఆహార ఎంపికల విషయంలో ఆరోగ్యపరమైన అంశాలకు అనుగుణంగా అలవాట్లు ఉండాలన్నారు. శారీరక, సామాజిక మానసిక మార్గాల ద్వారా మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి’ అని దక్షిణ ఇండియానా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యయన రచయిత Urska Dobersek వివరించారు. గత రెండు దశాబ్దాలుగా శాకాహారి, మానసిక అనారోగ్యం ఎక్కువగా కనిపిస్తోంది.
మాంసం తినేవారిలో మానసిక ఆరోగ్యం మధ్య సంబంధాలను పరిశీలించడంలో కఠినమైన సమీక్ష అవసరం. అంతేకాదు.. మాంసం వినియోగంతో మానసిక ఆరోగ్యం మధ్య సంబంధంపై మునపటి 18 అధ్యయనాలను పరిశోధకులు సమీక్షించారు. ఈ అధ్యయనాలలో యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఓషియానియా నుంచి మొత్తం 149,559 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో మాంసం తినేవారితో కలిపి 8,584 మాంసం తినడం మానేసిన వారిపై అధ్యయనం చేశారు.
‘శాఖాహారం’ విషయంలో పరిశోధకులు మాంసం తినేవారికి, మాంసానికి దూరంగా ఉన్నవారికి స్పష్టమైన వ్యత్యాసాన్ని అందించే అధ్యయనాలను మాత్రమే పరిశీలించారు. మాంసం తినడం మానేసిన వారు అధిక రేట్లు లేదా నిరాశ, ఆందోళన స్వీయ-హాని కలిగించే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఒత్తిడి, అవగాహనలోపం, జీవన నాణ్యతతో మాంసం వినియోగం ఎలా సంబంధం కలిగి ఉందో అన్నదానిపై స్పష్టత తక్కువగా ఉంది. మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడమే వ్యూహంగా తమ అధ్యయనం కొనసాగిందని అందులో మాంసానికి దూరంగా ఉండాలని తమ పరిశోధన ఉద్దేశం కాదు’ అని డోబెర్సెక్ PsyPostతో అన్నారు.
మాంసానికి దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధమేంటో ఇంకా అస్పష్టంగానే ఉంది. సమీక్షించిన 18 అధ్యయనాలలోనూ 16 క్రాస్ సెక్షనల్ డిజైన్‌ను ఉపయోగించారు. దీనికి గల కారణాలపై కొన్ని ఆధారాల ఆధారంగా లోతుగా పరిశీలించారు. మరో విషయం ఏమిటంటే.. శాఖాహారుల్లో చేప తినేవారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉన్నట్టు కనుగొన్నారు. మానసిక అనారోగ్యంతో పోరాడుతున్నవారి ఆహారాన్ని సెల్ఫ్ ట్రీట్ మెంట్‌గా మార్చవచ్చు. ఎవరైనా శాకాహారి రోజువారీ ఆహారంలో అచ్చం శాఖాహార ఆహారాలను మాత్రమే తీసుకుంటుంటే వారిలో మానసిక అనారోగ్యాన్ని పెంచే పోషక లోపాలకు దారితీయవచ్చు. చాలా మంది వ్యక్తులు వారి అనారోగ్యాన్ని దాచడానికి శాఖాహారాన్ని అనే మాటతో కవర్ చేస్తుంటారు.
జంతువుల విషయంలో సున్నితమైన భావాన్ని కలిగిన శాఖాహారుల్లో ఒత్తిడికి లోనయ్యే ప్రమాదంగా మారవచ్చు’అని డోబెర్సెక్ వివరించారు. తమ అధ్యయనంలో వైవిధ్యమైన ఆహారం తినడం సిఫారసు చేయడం అశాస్త్రీయమైనది, అనారోగ్యకరమైనదిగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నివారించాల్సిన ఆహారాలు, పానీయాలు పోషకాల సుదీర్ఘ జాబితాలో మాంసం, గుడ్లు, చక్కెర, ఉప్పు, కొవ్వు, పండ్ల రసాలు, కొలెస్ట్రాల్ మొదలైనవిగా పేర్కొన్నారు.
Also Read | కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణం : కేంద్రం