Melinda Gates
Melinda Gates : ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ అమెరికాతో పాటు యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ స్కామ్‌లో అనేక మంది వీఐపీల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఫొటోలు బయటకు వచ్చాయి. అమెరికా న్యాయశాఖ ఈ ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల చేసింది.
Also Read : Gautam Gambhir : భారత మ్యాచ్‌ను బహిష్కరించనున్న పాక్ ? గంభీర్ సమాధానం ఇదే..
మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ – మిలిందా గేట్స్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి 20ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు సంబంధించిన పలు విషయాలు వెల్లడవడంపై ఆయన మాజీ భార్య మిలిందా స్పందించారు.
ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌కు సంబంధాలు ఉండడం వల్ల.. అది నచ్చని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అప్పట్లో ఓ కథనంలో పేర్కొంది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోనూ బిల్‌గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపాడని, ఆ కారణంగా సుఖవ్యాధులు భారిన పడ్డారంటూ ఎప్‌స్టీన్ ఆరోపణలు చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆయన తన భార్య మిలిందాకు రహస్యంగా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్ తనను అడిగారని తెలిపాడు. కాగా.. ఈ ఆరోపణలను బిల్‌గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది. ఎప్‌స్టీన్ వాదనలో ఎలాంటి వాస్తవాలు లేవని, అవి పూర్తిగా అసంబద్ధమైనవని పేర్కొంది. అయితే, తాజా.. బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఈ విషయంపై స్పందించారు.
బిల్‌గేట్స్ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని, తన జీవితంలో ఆ సమయం చాలా బాధాకరమైనదని మిలిందా పేర్కొన్నారు. తమ బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విలువలను బిల్‌గేట్స్ నిలబెట్టుకోకపోవడం వల్లనే ఆయనతో విడాకులు తీసుకున్నట్లు మిలిందా చెప్పారు. అయితే, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ గురించి బయటకు వచ్చిన విషయంపై ఆమె మాట్లాడుతూ.. వాటి గురించి బిల్‌గేట్స్ సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని చెప్పారు.
బిల్ గేట్స్, మిలిండా గేట్స్ 27ఏళ్లు వైవాహిక జీవితంలో ఉన్నారు. 2021 సంవత్సరంలో వారు తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో బిల్‌గేట్స్, మిలిండా కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మిలిందాకు 61 ఏళ్లు. పిల్లలతోనే ఉంటున్నారు.