Gautam Gambhir : భారత మ్యాచ్‌ను బహిష్కరించనున్న పాక్ ? గంభీర్ సమాధానం ఇదే..
పాక్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించాలని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ను (Gautam Gambhir) విలేకరులు అడిగారు.
Gambhir Reaction viral after questions regarding Pakistan decision to boycott match against India
Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని తమ జట్టును పాక్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ మ్యాచ్ పై అనిశ్చితి ఏర్పడింది. కాగా.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు కూడా ఐసీసీకి అధికారికంగా వెల్లడించలేదు.
కాగా.. పాక్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించాలని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను విలేకరులు అడిగారు. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మంగళవారం ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో పాక్ మ్యాచ్‌పై గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది.
T20 World Cup 2026 : దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
అయితే.. దీనిపై గౌతమ్ గంభీర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నేరుగా అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత జట్టు టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో పాటు గ్రూప్-ఏలో ఉంది. ఈ మెగాటోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ఆడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్ఏతో తలపడనుంది.
#WATCH | Delhi: Indian Cricket Team Head Coach Gautam Gambhir leaves for Mumbai. pic.twitter.com/6fBlclolVO
— ANI (@ANI) February 3, 2026
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.
