Iran War: డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా దాడులు..

భారీ స్థాయిలో రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Published On : April 7, 2026 / 07:05 PM IST

Iran War: ఇరాన్ ఎనర్జీ హబ్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. డెడ్ లైన్ కి ముందే ఇరాన్ పై బాంబులతో విరుచుకుపడింది అమెరికా. ఇరాన్ లోని ఖర్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులు జరిగాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది అమెరికా. దీంతో ఇరాన్ లోని రైల్వే బ్రిడ్జి ధ్వంసం కాగా ఇద్దరు ఇరానీయులు మృతి చెందారు. భారీ స్థాయిలో రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైలు ప్రయాణాలు మానుకోవాలని ఇరాన్ పౌరులను హెచ్చరించింది ఇజ్రాయెల్.

హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ కు అమెరికా విధించిన గడువు మరికొన్ని గంట్లలో ముగియనుంది. అయితే ఇరాన్ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గడువు ముగిసినంత తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల దగ్గర మానవ హారాలుగా ఏర్పడాలని ఇరాన్ ప్రభుత్వం దేశ యువతకు పిలుపునిచ్చింది. గడువు ముగిసేలోపు హార్మూజ్ ను తెరవకపోతే ఇరాన్ లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

అంతకుముందులా డెడ్ లైన్ ను పొడిగించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అమెరికా దాడుల నుంచి విద్యుత్ కేంద్రాలను కాపాడుకునేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలోని విద్యుత్ కేంద్రాల వద్దకు ర్యాలీగా రావాలని క్రీడాకారులు, విద్యార్థులతో సహా యువతకు ఆ దేశ క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. యువత నుంచి స్వయంగా వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ శాఖ ఉప మంత్రి అలీ పేర్కొన్నారు.

Also Read: కోవిడ్ కొత్త వేరియంట్ సికాడా.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎంత ప్రమాదకారి అంటే..