Militant killed 42 soldiers in mali
Militant killed 42 soldiers: మాలిలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 42 మంది సైనికులు చనిపోగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. టెస్సిట్ పట్టణం సమీపంలో ఆదివారం ఈ దాడి జరిగినట్లు మాలి ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇది ఇస్లామిక్ సంస్థ అనుబంధ గ్రూపులు చేసిన దాడని మాలి ప్రభుత్వం ఆరోపించింది. ఈ మధ్య కాలంలో మాలిలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ముఖ్యంగా మాలి ఆర్మీపై ఇంత పెద్ద దాడి జరగడం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో దశాబ్దానికి పై నుంచి ఇస్లామిక్ అనుబంధ ఉగ్రవాద సంస్థలు అనేకం ఏర్పడ్డాయి.
‘‘టెస్సిట్ సమీపంలోని ఆర్మీ యూనిట్లపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు డ్రోన్లు, కార్ బాంబులు, ఇతర పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. ఆర్మీ యూనిట్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. అయితే ఈ దాడిలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు’’ అని బుధవారం ప్రభుత్వం చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొదట 17 మంది సైనికులు చనిపోగా.. తొమ్మిది మంది మిస్సయ్యారని ప్రకటించిన కొద్ది గంటలకే 37 మంది మరణించినట్లు తెలిపారు. ఈ సంఖ్య ప్రస్తుతం 42కు చేరింది.
మాలి దేశం మిలిటరీ పాలనలో ఉంది. 2020లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని జుంటా మిలిటరీ కూలదోసి అధికారాన్ని చేపట్టింది. అయితే హింసను అదుపు చేయడంలో జుంటా మిలిటరీ విఫలమైనందుకు మాలి ప్రజలు విసుగు చెందారు. అప్పటి నుంచి ఇలాంటి దాడులు సర్వసాధారణం అయిపోయాయి.
UK PM candidate Rishi Sunak: అసవరమైతో ఓడిపోతా.. కానీ తప్పుడు వాగ్దానాలు చేయను