Dog Hair Dye: కుక్క హెయిర్ డై కోసం రూ.5లక్షలు

రష్యన్‌ మోడల్‌కు ఇలాంటి పనే చేసింది. పైగా తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్‌ మోడల్‌ అన్నా స్టూపక్. అది కాస్తా బెడిసికొట్టడంతో.

Russina Model

Dog Hair Dye: మనిషికో పిచ్చి.. జిహ్వకో రుచి అన్నట్లు ఎవరి ఆనందం వాళ్లది. కొందరు మొక్కలు పెంచుకుంటే.. ఇంకొందరు పెంపుడు జంతువులని.. ఇక తాము ప్రేమగా పెంచుకుంటున్న వారికోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి రెడీ ఉంటారు. వాటికి స్నానం చేయించేందుకు, బట్టలు కొనడం కోసం వేలల్లో కాదు.. లక్షల్లో వెచ్చిస్తున్నారంట.

తాజాగా రష్యన్‌ మోడల్‌కు ఇలాంటి పనే చేసింది. పైగా తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్‌ మోడల్‌ అన్నా స్టూపక్. అది కాస్తా బెడిసికొట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కుక్క హెయిర్‌కు డై చేయించింది. దాని కోసం ఏకంగా రూ.5వేల యూరోలు అంటే రూ.5లక్షలు కేటాయించింది.

నియాన్‌ ఆరెంజ్‌ రంగుతో పూర్తి డై చేయించిందట. ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ చెప్పుకొచ్చింది. మోడల్ చేసిన పనికి నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సరదా కోసం మూగ జీవిని హింసించడమేంటని శైలిలో తిట్టిపోస్తున్నారు. అలా అన్నా స్టూపక్ వార్తల్లోకి ఎక్కింది.

 

………………………………. : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..