Longest Alligator Kill : అమెరికాలో అతి పొడవైన ఎలిగేటర్‌ను చంపిన మిస్సిస్సిప్పి వేటగాళ్ళు
రాష్ట్రంలోని యాజూ నదిలో ఎలిగేటర్‌ను బంధించారు. ఎలిగేటర్‌ను పట్టుకోవడానికి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పోరాటం కొనసాగిందని హంటర్ డొనాల్డ్ వుడ్స్ తెలిపారు.
- bheemraj
- Updated on- September 2, 2023 / 02:30 PM IST
Longest Alligator Kill
Mississippi Hunter Kill Longest Alligator : అమెరికాలో మిస్సిస్సిప్పి వేటగాళ్ళు అతి పొడవైన ఎలిగేటర్‌ను చంపారు. మిస్సిస్సిప్పి డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌ఫైర్, ఫిషరీస్ అండ్ పార్క్స్ తెలిపిన ప్రకారం.. ఎలిగేటర్ జంతువు 14 అడుగులు, 3 అంగుళాల పొడవు మరియు 364 కిలోల బరువు కలిగి ఉంది. రాష్ట్రంలోని యాజూ నదిలో ఎలిగేటర్‌ను బంధించారు. ఎలిగేటర్‌ను పట్టుకోవడానికి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పోరాటం కొనసాగిందని హంటర్ డొనాల్డ్ వుడ్స్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా అవుట్‌లెట్‌తో మాట్లాడుతూ తాము 8 అడుగులు, 10 అడుగులు కల్గిన చాలా ఎలిగేటర్ల సమూహాన్ని చూశాం కానీ, ఇప్పుడు పెద్ద ఎలిగేటర్ ను వెంబడించినట్లు చెప్పారు.
ఎలిగేటర్‌ను పట్టుకునే ప్రయత్నంలో అది ఎంత పెద్దదో తనకు తెలియదని మత్స్యకారుడు చెప్పాడు. తాము చాలా కాలంగా దీని కోసం వేటాడుతున్నామని తెలిపారు. ఎలిగేటర్ విశాలంగా ఉందని తనకు తెలుసని మిస్టర్ వుడ్స్ చెప్పాడు. ఎలిగేటర్ వెన్ను పెద్దగా ఉందని, అది తమ జోన్ పడవ మాదిరిగా ఉందన్నారు. తాము 10 లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు దాన్ని పట్టుకున్నామని తెలిపారు. ఆ సమయంలో అది తన రాడ్ విరిచినట్లు పేర్కొన్నారు. తాము దానిని 8 లేదా 9 సార్లు కట్టి పడేశాము అయినా అది విరిగిపోతూనే ఉందని తెలిపారు.
Alligator Gar Fish : బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో.. వలకు చిక్కిన వింత చేప, అచ్చం మొసలిలా ఉంది
అది క్రిందికి వెళ్లి కూర్చొని, అనంతరం మళ్లీ పైకి వచ్చిందన్నారు. ఎలిగేటర్ దుంగల కిందకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ పోరాటంతో అది మాసికంగా కుంగిపోయిందని వేటగాళ్లు తెలిపారు. రాత్రంతా పోరాడటంతో ఎలిగేటర్ చివరకు అలసిపోయిందన్నారు. 2017లో నాచెజ్ పశ్చిమ నగరానికి సమీపంలో మిస్సిస్సిప్పిలో అనుమతించబడిన వేటగాడు పొడవైన మగ ఎలిగేటర్ పట్టుకున్నారు. ఇది 14-అడుగుల, 0.75-అంగుళాల పొడవు (4.29 మీ) కలిగి ఉండి, 347.5 కిలోల బరువు ఉంది.
