చిన్నారిని కిడ్నాప్ చేయాలనే ప్లాన్ లో భాగంగా కోతి సైకిల్‌పై వచ్చింది. చివరి వరకూ ప్రయత్నించింది కానీ, ఆ సమయానికే అందరూ అలర్ట్ అయిపోవడంతో తుర్రున ఉడాయించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అందులో పిల్లలంతా బెంచ్ మీద కూర్చొని ఉండగా.. కోతి ఫుల్ స్పీడుతో బైక్ మీద వస్తుంది.
ఆ పిల్లలను చూడగానే బైక్ మీద నుంచి దూకి ఆ పాపను పట్టుకు లాగుతుంది. చెయ్యి జారిపోతుండటంతో డ్రస్ పట్టుకుని లాగుతుంది. మళ్లీ రోడ్ మీద పడిపోయినా తీసుకెళ్దామనే ప్లాన్ లో మెడ పట్టుకుంటుంది. కొంచెం దూరం వెళ్లగానే స్థానికులు అలర్ట్ అవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది.
ఆ చిన్నారి కూడా ఏమీ ఎరగనట్లు వచ్చి మళ్లీ అదే బెంచ్ మీద కూర్చొండిపోతుంది. ఈ సీన్ మొత్తాన్ని అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ పోస్టు చేశాడు. ‘కోతి మోటార్ సైకిల్ తొక్కిన సంగతి నాకు గుర్తులేదు. ఇంకా ఓ చిన్నారిని దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది’ అంటూ పోస్టు చేశాడు.
We are surely living in strange times?
Broad daylight kidnapping attempt by monkey……VC- Rex pic.twitter.com/04grUaB4eY
— Susanta Nanda IFS (@susantananda3) May 4, 2020
8గంటల్లోనే ఆ పోస్టుకు 22వేల రీట్వీట్లు, 69వేల లైకులు, 36వందల మంది మెసేజ్ లు పెట్టి వైరల్ చేశారు. ఇదే వీడియోను షేర్ చేస్తూ సుశాంత నందా ఐఎఫ్ఎస్ ఇదేంటి వింతగా ఉంది. పట్టపగలు కోతి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిందంటూ కామెడీగా రెస్పాండ్ అయ్యాడు.
See Also | ఇంట్లోనే పెళ్లి.. రిసెప్షన్ ఏర్పాటు చేసిన పోలీసులు