వైరల్ వీడియో: ఆన్‌లైన్‌లో కిరాణా సామాన్లు ఆర్డర్ చేసిన కోతి 

  • Publish Date - November 14, 2019 / 10:39 AM IST

కోతి చేసే పనులను కోతి పనులు అంటాం. ఎందుకంటే అవి చేసే పనులన్నీ ఫన్నీగా ఉంటాయి కాబట్టి. కానీ ఓ కోతి చేసిన పని గురించి తెలిస్తే ..ఆశ్చర్యపోవాల్సిందే. మొబైల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి కావాల్సి కిరాణా సరుల్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేసింది. వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది.కానీ ఇది నిజంగా జరిగింది. సీసీ టీవీ పుటేజ్ వీడియో చూస్తే  మీరు కూడా నమ్ముతారు. 

అసలు జరిగిందేంటంటే..చైనాలో ఉండే చాగ్జోవ్ వైల్డ్ యానిమల్ వరల్డ్ లో పని చేస్తుంటుంది. ఆమె ఓ కోతిని పెంచుకుంటోంది. దాని పేరు మ్యాగ్‌. ఆ కోతి తన యజమాని చేసే పనులన్నింటినీ శ్రద్ధగా గమనించేది. అతను ఏంచేస్తే అది చేస్తుంటుంది. దాన్ని చూసి చాగ్జోవ్ తెగ మురిసిపోయేది. ఈ క్రమంలో చాగ్జోవ్ తన మొబైల్ ఫోన్ చూసుకుంటు ఓసారి తెగ ఆశ్చర్యపోయింది. దాంట్లో ఇంటికి కావాల్సిన కిరాణా సరుకుల్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినట్లుగా ఉంది. నేను చేయలేదు.. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు మరి.. ఎవరు చేసారబ్బా అనుకుంది. దీంతో ఇంట్లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ పరిశీలించింది. తన పెంపుడు కోతి ఈ వీటిని ఆర్డర్ చేసినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తన బుజ్జి కోతి పనికి తెగ మురిసిపోయాడు చాగ్జోవ్. ఆ సీసీ టీవీ పుటేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది.  
 
ఈ సందర్భంగా  చాగ్జోవ్ మాట్లాడుతూ..ఎప్పుడూ ఏదోకటి చేస్తూ కోతిని మ్యాగ్‌మ్యాగ్ అని మాట్లాడుతూ తాను కిరాణా సామాను ఆర్డర్ చేస్తుంటానని..అది గమినించిన కోతి తాను లేనపుడు తన ఫోను తీసుకుని సరుకులను ఆర్ఢర్ చేసిందని తెలపింది. ఈ ఆర్డర్ అందుకున్న కంపెనీ సదరు కోతి చేష్టలకు ముచ్చటపడింది. కోతికి ఇష్టమైన..అది కోరుకున్న సామానును దానికి అందించింది.ఈ వీడయో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.