Video : అంపైర్ “హ్యాట్”ట్రిక్ చూశాక Wow అనకుండా ఉండలేరు
పెర్త్ స్టేడియం వేదికగా ఆసీస్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, పాకిస్తాన్ అంపైర్
- veegam team
- Published on- December 15, 2019 / 07:41 AM IST
పెర్త్ స్టేడియం వేదికగా ఆసీస్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, పాకిస్తాన్ అంపైర్
పెర్త్ స్టేడియం వేదికగా ఆసీస్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ మధ్య జరిగిన ఘటన అందర్నీ అట్రాక్ట్ చేసింది. నెటిజన్లు వావ్ అంటున్నారు. వాట్ ఏ క్యాచ్ అని ప్రశంసలు కురిపించారు.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 166 పరుగులకే కివీస్ ని ఆలౌట్ చేసింది. ఆ సమయంలో… స్టీవ్ స్మిత్… ఓ ఫ్లాపీ హ్యాట్‌ను ఫీల్డ్ నుంచి పాస్ చేశాడు. అది ఫ్లయింగ్ సాసర్లా గాల్లో ఎగురుతూ వెళ్లింది. దాన్ని ఒకే చేతితో…. అంపైర్ అలీమ్ దార్ సూపర్ గా క్యాచ్ పట్టారు. అంపైర్ దార్.. తన చేతిని గాల్లోకి లేపి హ్యాట్ ను క్యాచ్ పట్టిన విధానం అద్భుతంగా సాగింది.
ఈ వీడియో క్లిప్‌ని క్రికెట్ డాట్ కామ్ ఏయూ ట్విట్టర్లో షేర్ చేసింది. అంతే.. ఈ వీడియో వైరల్ గా మారింది. అందరికీ తెగ నచ్చేసింది. ఐసీసీ కూడా దీనిపై స్పందించింది. ఇదో గోల్డెన్ మూమెంట్ అని కొందరు కామెంట్ చేస్తే.. మూమెంట్ ఆఫ్ ది డే అని మరికొందరు మెచ్చుకున్నారు. వాట్ ఏ హ్యాట్ ట్రిక్ అంటూ కితాబిస్తున్నారు. సూపర్ క్యాచ్ అని అంపైర్ ని పొడుగుతున్నారు. ”Neat Hat Trick” అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
