ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. 200కు పైగా దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. కరోనా కట్టడికి అన్ని దేశాలు కీలక
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. 200కు పైగా దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. కరోనా కట్టడికి అన్ని దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. లాక్ డౌన్ ను స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల కొంతమంది ప్రజలు లాక్ డౌన్ నిబంధను ఉల్లంఘిస్తున్నారు. అలాంటి వారి పట్ల పోలీసులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు లాఠీలకు పని చెబుతున్నారు. మన దేశంలో లాఠీలకు మాత్రమే పని చెబుతున్నారు పోలీసులు. కానీ నైజీరియాలో మాత్రం లాక్ డౌన్ నిబంధన ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చినందుకు ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు.
అవును నిజమే. కరోనా వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధించినా వినిపించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని నైజీరియా మిలటరీ షూట్ చేసింది. సదరన్ స్టేట్ డెల్టాలోని వారీ సిటీలో ఈ ఘటన జరిగింది. ఆయిల్ సిటీకి చెందిన జోసెఫ్ పెసు నిబంధనలను లెక్క చేయకుండా బయటకు వచ్చాడు. దీంతో సిబ్బంది అతడిపై కాల్పులు జరపడంతో చనిపోయాడని అధికారులు చెప్పారు.(కరోనా టెర్రర్.. 11మంది CISF జవాన్లకు పాజిటివ్)
ఈ విషయం తెలిసి కొందరు స్థానిక యువకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. షాపులకు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నైజీరియాలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. 184 కేసులు నమోదయ్యాయి. దీంలో అలర్ట్ అయిన ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధించింది. చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తోంది.
* 205 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువైన కరోనా బాధితుల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 59వేల 140మంది మృతి
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 98వేలకుపైగా కేసులు
* ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 82వేల కొత్త కేసులు, 6వేల మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 2.28 లక్షల మంది
* అమెరికాలో విజృంభిస్తున్న కరోనా వైరస్, 2.76లక్షలు దాటిన కరోనా కేసులు
* అమెరికాలో నిన్న ఒక్క రోజే 32వేలకు పైగా కొత్త కేసులు నమోదు
* అమెరికాలో నిన్న ఒక్క రోజే 1,320మంది మృతి
* అమెరికాలో ఏడున్నర వేలకు చేరిన మరణాలు, ఇప్పటివరకు 7వేల 391మంది మృతి
* అమెరికాలో, స్పెయిన్, బ్రిటన్ లో పెరిగిపోతున్న కరోనా మరణాలు
* న్యూయార్క్ లో కరోనా మృతుల ఖననానికి ఇబ్బందులు, స్థలాల కొరత
* ఒక్క న్యూయార్క్ లోనే దాదాపు లక్ష కేసులు, 3వేల మరణాలు
* న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ లలో చైనాను మించిన కేసులు