indonesia New Capital : కొత్త రాజధాని నిర్మిస్తున్న ఇండోనేషియా .. బడ్జెట్ ఎంతో తెలుసా..?

ద్వీపంలో కొత్త రాజధాని నిర్మాణం. 2024లోకి అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణం కొనసాగుతోంది.

indonesia new capital Nusantara : ఇండోనేషియా (indonesia)కొత్త రాజధాని (new capital) నుసంతర (Nusantara) నిర్మిస్తోంది. నిర్మాణానికి అదనంగా 15 ట్రిలియన్ రూపాయలు (1.01 బిలియన్ డాలర్లు)కు పార్లమెంటరీ బడ్జెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇండోనేషియా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించిందని కమిటీ  చైర్ పర్సన్ సయ్యద అబ్దుల్లా (Said Abdullah) శుక్రవారం (జూన్ 9,2023) తెలిపారు.

2023లో బోర్నియో ద్వీపం (Borneo island) నుసంతరాను నిర్మించటానికి గతంలో రూ.22 లక్షల కోట్లతో పాటు అదనంగా మరో 1.01 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు సయ్యద్ అబ్దుల్లా వెల్లడించారు. నగర నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని.. 2024 జూన్ లో దేశాధ్యక్షుడు జోకో విడోడో (President Joko Widodo) ఈ నగరంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.2024 జూన్ కల్లా రాజధాని ప్రధాన పరిపాలనా కార్యాలయాలు, అధ్యక్ష భవనంతో పాటు కీలక మంత్రిత్వ శాఖల భవనాలు, 16,000 మంది ఉద్యోగులు, మిలటరీ, పోలీసులతో తరలి వెళ్లనుందని తెలిపారు.

కాగా కొత్త రాజధాని నుసంతర నగర నిర్మాణానికి 32 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ దీనిలో 20 శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని..మిగిలిన సొమ్మును ప్రైవేటు రంగం నుంచి సేకరిస్తామని జోకో విడోడో (Joko Widodo)హామీ ఇచ్చారు.కానీ ఇది నెరవేరేలా లేదు. అందుకే అదనంగా నిధులు ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరిగాయి.

అయితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ ప్రాజెక్టు కొనసాగింపు గురించి పెట్టుబడిగదారులు ఆదోళన చెందుతున్నందున ఒక్క పెట్టుబడి ఒప్పందం కూడా కుదరలేదు. కాగా ఇండోనేషియాలో 2024 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దీని కోసం ఎన్నికలు జరుగనున్నాయి. ఇండోనేషియా పాత రాజధాని జకార్తా. కొత్త రాజధాని నుసంతర బోర్నియో ద్వీపంలో జరుగుతోంది.







                                    

ట్రెండింగ్ వార్తలు