Viral video : 8 కాళ్ల ఆక్టోపస్ రెండు కాళ్లతో భలే నడిచిందే అచ్చంగా మనిషిలా..
మనిషి రెండు కాళ్లమీద నడుస్తాడు. జంతువులు నాలుగు కాళ్లమీద నడుస్తాయి. సముద్రాల్లో నివసించే ఎనిమిది కాళ్లుండే ఆక్టోపస్ రెండు కాళ్లమీద నడిచి వైరల్ గా మారింది.
- nagamani
- Published On : July 21, 2021 / 06:20 PM IST
Octopus Walking With Two Legs
octopus walking with two legs : మనిషి రెండు కాళ్లమీద నడుస్తాడు. జంతువులు నాలుగు కాళ్లమీద నడుస్తాయి. ఈ సమస్త సృష్టిలో కొన్ని కొన్ని కీటకాలు..ప్రాణులు వాటికుండే కాళ్లమీద నడుస్తాయి. కొన్నింటికి ఆరు కాళ్లు ఉంటే మరికొన్నింటికి ఎనిమిది కాళ్లుంటాయి. కాళ్లు అంటే కాళ్లు కాకపోయినా అవి వాటిసహాయంతోనే నడుస్తాయి. లేదా పాకుతాయి. అటువంటి వాటిలో ఆక్టోపస్ కూడా ఒకటి. దీనికి ఎనిమిది కాళ్లుంటాయి. ఆక్టోపస్ లు చాలా తెలివైనవి. చుట్టూ ఉన్న పరిసరాలను చూసి చాలా నేర్చుకుంటాయి.
ప్రమాదం పొంచి ఉంటే దాన్నుంచి తప్పించుకోవాటానికి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తు తప్పించుకుంటాయి. ఇదిలా ఉంటే ఆక్టోపస్ అచ్చంగా మనుషిలాగా రెండు కాళ్లమీద నడవటం ఎప్పుడన్నా చూశారా? బహుశా చూసి ఉండరు. కానీ ఈ వీడియోలో ఓ ఆక్టోప్ అచ్చు మనిషిలాగా రెండు కాళ్లతో చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇది రెండు కాళ్లతో నడవటం చూస్తే మనిషుల్ని చూసి నేర్చుకుందా ఏంటీ అనిపిస్తుంది..ఈ వీడియో వైరల్ గా మారింది.
మనకు చేతులు, కాళ్లు ఎలాగో.. ఆక్టోపస్‌కి టెంటకిల్స్ అలాగ. వాటిని అది కాళ్లు, చేతుల లాగా వాడుకుంటాయి. వాటితోనే వస్తువుల్ని పట్టుకుంటుంది. అలా ఓ ఆక్టోపస్ రెండు కాళ్లతో నడుచుకుంటూ వెళ్లిపోయిన ఈ వీడియోని ట్విట్టర్‌లో బ్యూటెన్‌గెబీడెన్ అనే యూజర్ షేర్ చేశారు. ఓ ఆక్టోపస్ వెనక డైవర్ వెళ్తూ… వీడియో తీస్తుంటే… అది పారిపోతూ ఉన్నట్లుగా ఈ వీడియోలో ఉంది.
Octopus jogging in a tutu.. ? pic.twitter.com/LnoFMEnxnw
— Buitengebieden (@buitengebieden_) July 15, 2021
