Tiniest Bike: అతిచిన్న సైకిల్ నడిపిన వృద్ధుడు.. ఆకట్టుకుంటున్న క్రేజీ వీడియో
అడుగు కూడా లేని బైకులు, సైకిళ్ల బొమ్మలు చిన్న పిల్లలు నడిపేందుకు కూడా పనికిరావు. కానీ, అంత తక్కువ పొడవున్న ఒక బైకును నడుపుతున్నాడో వృద్ధుడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
- Narender Thiru
- Published On : August 6, 2022 / 02:52 PM IST
Tiniest Bike: ఒక్క అడుగు కంటే చిన్నగా ఉన్న సైకిల్‌ను ఎప్పుడైనా నడిపారా? అసలు అంత చిన్నగా ఉండే సైకిల్ తొక్కడం సాధ్యమేనా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మీకే అర్థమవుతుంది. ఒక్క అడుగు కూడా లేని ఒక సైకిల్‌ను ఒక వృద్ధుడు ఎంత చక్కగా తొక్కుతున్నాడో.
China Spy Ship ‘Yuan Wang 5’ : చైనా నిఘా నౌక వల్ల భారత్ కు ఎటువంటి ప్రమాదం..?
రష్యాలోని మాస్కోకు చెందిన సెర్గీ దషెవ్‌స్కీ అనే వృద్ధుడు ఇలాంటి అతి చిన్న బైకులను తయారు చేస్తుంటాడు. గతంలో కూడా ఇలాంటి బైకులు తయారు చేసి, వాటిని నడిపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఎనిమిది సెంటీమీటర్లే ఉన్న బైక్ తయారు చేసి, దాన్ని నడిపాడు. తాజాగా అలాంటిదే మరో బైక్ కూడా తయారు చేశాడు. ఇది ఒక్క అడుగుకంటే చిన్నగా ఉంది. దీన్ని అందరి సమక్షంలో నడిపి చూపించాడు.
Chiranjeevi Tweets: బింబిసార, సీతా రామం సక్సెస్‌లపై మెగాస్టార్ కామెంట్స్!
కొందరు దీన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 1.60 లక్షలపై పైగా లైకులతో ట్రెండ్ అవుతోంది. అంతగా నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియోను మీరూ చూడండి.
Riding the tiniest bike pic.twitter.com/HLkdGKQsSh
— Interesting As Fuck (@InterestingsAsF) August 5, 2022
