Omicron And Covid-19 : కరోనా టెర్రర్..క్రిస్మస్ వేళ..కంప్లీట్ లాక్ డౌన్

స్తుత పరిస్థితి చూస్తుంటే క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలతో కోవిడ్ కేసులు మరింత పెరుగడం పక్కా అని నిపుణులు అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా...

Lockdown

Christmas Lockdown : కరోనా ఇంకా ప్రపంచాన్ని వీడడం లేదు. రెండు సంవత్సరాలుగా ఈ దిక్కుమాలిన మహమ్మారి..ఎంతో మందిని బలి తీసుకొంటోంది. దీనితో గత రోజులు కళ్ల ముందు మెలుగుతున్నాయి. మునపటి రోజులు మరలా వస్తాయా ? అని ప్రజలు అనుకుంటున్నారు. అనుకున్నట్లే..నెదర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో మళ్లీ లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంది. కంప్లీట్ క్రిస్మస్ లాక్ డౌన్ ను ప్రవేశపెట్టింది. 2021, డిసెంబర్ 19వ తేదీ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. జనవరి 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే వెల్లడించారు.

Read More : Microwave : మైక్రోవేవ్ లో వండిన ఆహారం తినటం మంచిదేనా?

కోవిడ్ తో పాటు ఒమిక్రాన్ విస్తరిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, క్రిస్మస్ వేళ ఈ నిర్ణయం తీసుకోవడం కొంత బాధగానే ఉందన్నారు. అయితే..కొన్నింటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందని, అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకుల రవాణా..వీటికి సంబంధించి దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా…దగ్గరి బంధువులు మాత్రమే పిలుచుకోవాలని..వాళ్లు కూడా కేవలం నలుగురు మాత్రమే ఉండాలనే నిబంధన విధిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలను జనవరి 09వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read More : Hyderabad Temperature : పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

మరోవైపు…ఒమిక్రాన్‌.. ఇప్పుడీ పేరు వింటేనే అగ్ర దేశాలు వణుకుతున్నాయి.. ఇండియాలో ఇప్పుడిప్పుడే చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ వేరియంట్‌.. అగ్ర దేశాలను మాత్రం వణికిస్తోంది.. ఊహించని వేగంతో కేసుల సంఖ్య పెరగడం.. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అంతకు మించి పెరగడంతో మళ్లీ తలలు పట్టుకుంటున్నారు దేశాధినేతలు.. ముఖ్యంగా ఈ వేరియంట్‌ను మొదట గుర్తించిన సౌతాఫ్రికాతో పాటు అమెరికా, యూకేలో పరిస్థితి దారుణంగా మారిపోయింది.. మళ్లీ మునుపటి రోజులు వారి కళ్ల ముందు కనపడుతున్నాయి.. నెదర్లాండ్స్ దేశంలో డెల్టా వేరియంట్‌ కంటే యమ స్పీడ్‌గా దూసుకుపోతుంది.. దేశం ఏదైనా ఒక్కసారి ఎంటరైతే చాలు మూడు రోజుల్లో కేసుల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలతో కోవిడ్ కేసులు మరింత పెరుగడం పక్కా అని నిపుణులు అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా బ్రిటన్‌, అమెరికాలో పరిస్థితులు మరింత దిగజారే పరిస్థితి ఉందంటున్నారు.. ప్రభుత్వాలు ముందే మేల్కోనకపోతే మరిన్ని దారుణాలు చూడటం జరగడం ఖాయమంటున్నారు..