Hyderabad Temperature : పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 అయిన చలి తీవ్రత తగ్గడం లేదు

Hyderabad Temperature : పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

Hyderabad Temperature

Hyderabad Temperature : హైదరాబాద్ నగరంలో చలి ప్రజలను వణికిస్తుంది. ఉదయం 10 అయిన చలితీవ్రత తగ్గడంలేదు. మరోవైపు స్వల్పంగా మంచుకూడా కురుస్తోంది. చలితీవ్రత అధికంగా అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దం కాలంలో డిసెంబర్ నెలలో అత్యంత తక్కువ చలి రోజులుగా 18వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ దశాబ్దంలో డిసెంబర్ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. శనివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.2 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చదవండి : Telangana Temperature: మండుతోన్న ఎండలు.. దేశంలోనే తెలంగాణ మూడో స్థానం

గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రానున్న మూడు రోజులు చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

చదవండి : High temperature : కరోనాకు తోడు ఏపీ వాసులకు మరో ముప్పు..
చదవండి : Telangana : రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు