“మే ఐ హెల్ప్?”: నీటిలో ఉన్న మనిషికి సాయం చేసేందుకు చేయి అందించిన ఒరంగుటాన్

  • Publish Date - February 12, 2020 / 03:52 AM IST

కోతి జాతికి చెందిన ఒరంగుటాన్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. నీటి మడుగులో పడిపోయిన ఓ మనిషికి సహాయం చేస్తున్న ఒరంగుటాన్ సదరు వ్యక్తికి చేయి అందించి మడుగులోంచి బైటకు తీసుకురావటానికి సహాయం చేస్తానంటూ తన చేతిని అందించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే..బోర్నియోలోని ఓ సఫారీ పార్క్‌లో ఉన్న నీటి మడుగులో ఆ పార్క్ లోనే పనిచేస్తున్న ఓ వ్యక్తి ఓ పనిమీద నీటి మడుగులో దిగాడు. ఎందుకంటే..జంతువులకు అక్కడ ఉండే విషపూరితమైన పాముల వల్ల ప్రమాదం ఉంది. దీంతో పార్కులో పని చేస్తున్న వ్యక్తి.. పాములను పట్టుకునేందుకు యత్నిస్తున్న క్రమంలో అక్కడున్న ఓ నీటి మడుగులోకి అతను దిగాడు.
 
అందులో పాములను వెతికాడు..పని పూర్తి అయిన తరువాత మడుగులోంచి బైటకు రావటానికి యత్నిస్తున్నాడు. అంతలో అతన్ని కొంతసేపటి నుంచి గమనిస్తున్న ఓ ఒరంగుటాన్ దూరం నుంచి గమనించింది. వెంటనే గునగునా నడుచుకుంటూ మడుగు దగ్గరికి వచ్చి.. అందులోంచి పైకి లాగేందుకు “మే ఐ హెల్ప్?” అన్నట్లుగా ఆ వ్యక్తికి తన చేయి అందించింది. పార్కు సందర్శనకు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తి ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

మడుగులో ఉన్న ఆ వ్యక్తి మాత్రం ఒరంగుటాన్ చేయి పట్టుకోకుండానే మరోపక్కనుంచి బైటకు వచ్చాడు. అలా పైకి వచ్చిన వ్యక్తితో ప్రభాకర్ మాట్లాడారు. ఎందుకు ఒరంగుటాన్ ఇచ్చిన చేయిని పట్టుకోవాలని అనిపించలేదా? అని ప్రశ్నించాడు. దాని అతను అడవిలో ఉండే జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలీదు..అందుకే అలా అని తెలిపారు.కానీ తనకు ఇటువంటి సందర్భం ఎదురు కావటం చాలా  భావోఉద్వేగంగా అనిపించింది అని తెలిపాడు. 

ఒరంగుటాన్ లు సహజంగా మనుష్యుల్లానే మంచి తెలివిగలవి. అచ్చు మనుష్యుల్లా ప్రవర్తించే ఇవి మనుషులతో చక్కగా కలిసిపోతాయి. స్నేహం కూడా చేస్తాయి. మనిషిలాగానే రెండు కాళ్లమీద కూడా నడుస్తాయి. చెట్లపై చక్కటి విన్యాసాలు కూడా చేస్తాయి.