Indian citizenship: పుష్కర కాలంలో 16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారట

ఈ 12 ఏళ్లలో అత్యధికంగా 2022లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, అత్యల్పంగా 2020లో 85,256 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీంతో మొత్తంగా 2011 నుంచి 2022 డిసెంబర్ ముగిసేనాటికి 16,63,440 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

Indian citizenship: గడిచిన పుష్కర కాలంలో సుమారు 16 లక్షల మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రకటించింది. ఇందులో అత్యధికంగా గతేడాది 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈ వివరాలను వెల్లడించారు. 2011 నుంచి 2022 వరకు గల వివరాలను కేంద్రం వెల్లడించింది.

PM Modi: నెహ్రూ పేరు పెట్టుకోవడానికి ఎందుకంత అవమానం?.. గాంధీ కుటుంబంపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది.. ఇక 2022లో 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ 12 ఏళ్లలో అత్యధికంగా 2022లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, అత్యల్పంగా 2020లో 85,256 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీంతో మొత్తంగా 2011 నుంచి 2022 డిసెంబర్ ముగిసేనాటికి 16,63,440 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

Adani Hindenburg Row : అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్, హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు గ్రీన్‌సిగ్నల్

ఒక నిర్దిష్ట ప్రశ్నకు కేంద్ర మంత్రి జయశంకర్ స్పందిస్తూ గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందారని వెల్లడించారు. అయితే భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు.. మొత్తంగా 135 దేశాల్లో పౌరసత్వాన్ని పొందారు. ఆ వివరాలను కూడా కేంద్ర మంత్రి జయశంకర్ పార్లమెంటుకు అందించారు.

ట్రెండింగ్ వార్తలు