పాకిస్తాన్ భారీ కుట్ర : భద్రతా దళాల రేషన్‌లో విషం

పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్‌లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ

  • Publish Date - March 3, 2019 / 10:12 AM IST

పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్‌లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ

పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్‌లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్(PMI), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌లు(ISI) జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోని భారత భద్రతా దళాల రేషన్‌లో(ఆహారం) విషం కలిపేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ నేర దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. కాశ్మీర్ లోయలోని భద్రతా సంస్థలను అలర్ట్ చేసింది. కాశ్మీర్ లోయలోని భద్రతా దళాల కోసం సేకరించే రేషన్‌ను(బియ్యం, పప్పు దినుసులు) ఎప్పటికప్పడు తనిఖీ చేయాలని ఆదేశించింది.

పుల్వామా ఘటన తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత మిలటరీ పోస్టులపై కాల్పులకు తెగబడుతోంది. దీనికి మన సైన్యం ధీటుగా బదులిస్తోంది. భారత జవాన్ల ముందు పాక్ పప్పులు ఉడకటం లేదు. దీంతో దొంగ దారిలో దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు సరఫరా చేసే బియ్యం, పప్పు దినుసులు వంటి ఆహార పదార్దాల్లో విషం కలపాలని పాక్ ఐఎస్ఐ కుట్రలు పన్నినట్టు తెలుస్తోంది. ఐఎస్ఐ కుట్రలను భారత నిఘా వర్గాలు ముందే పసిగట్టి అప్రమత్తమయ్యాయి.

పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు, ఆ తర్వాత భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాల్సి రావడం.. ఈ పరిణామాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ చేతిలో చావుదెబ్బ తినాల్సి రావడం జీర్ణించుకోలేకపోతోంది. భారత్ పై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రమంలో భారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు పాక్ కుట్రలు చేస్తోంది.