Pakistan: జనాభా నియంత్రణకు సరికొత్త విధానం కనుక్కున్న పాక్ మంత్రి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

దేశంలోని ఇంధన పొదుపు ప్రణాళికలపై మీడియాతో మంత్రి ఆసిఫ్ మాట్లాడారు. ఈ సందర్భంలోనే పెళ్లి మండపాలను రాత్రి 10 గంటలకు, మార్కెట్లను రాత్రి 8:30 గంటలకు మూసివేయాలని అన్నారు. ఇది దేశానికి 60 బిలియన్ రూపాయల ఆదా చేయడంలో సహాయపడుతుందని సైతం ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంధన దిగుమతులను తగ్గించేందుకు ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెడతామని తెలిపారు.

Pak Minister's Bizarre Theory On Population Boom

Pakistan: జనాభా నియంత్రణపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మార్కెట్లు రాత్రి 8 గంటలకు మూసివేసినట్లైతే జనాభా పెరుగుదల రేటు తగ్గుతుందని, ఆ సమయానికి మూసివేసిన ప్రాంతాల్లో జనాభా పెరుగుదల అదుపులోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం దేశ రాజధాని ఇస్లామాబాద్‭లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Bihar: మహిళలకు విద్య లేదు, పురుషులకు పట్టింపు లేదు.. జనాభా నియంత్రణపై నితీశ్ సంచలన వ్యాఖ్యలు

కాగా, మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఆ వీడియోలో “రాత్రి 8 గంటలకు మార్కెట్లు ముగిసే దేశాల్లో జనాభా పెరుగుదల లేదు’’ అని రక్షణ మంత్రి ఆసిఫ్ అన్నారు. అయితే ఈ వీడియోను నెటిజెన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో తన పక్కన కూర్చున్న వ్యక్తి ముఖంలోని మార్పులు చూడాలంటూ పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు.


దేశంలోని ఇంధన పొదుపు ప్రణాళికలపై మీడియాతో మంత్రి ఆసిఫ్ మాట్లాడారు. ఈ సందర్భంలోనే పెళ్లి మండపాలను రాత్రి 10 గంటలకు, మార్కెట్లను రాత్రి 8:30 గంటలకు మూసివేయాలని అన్నారు. ఇది దేశానికి 60 బిలియన్ రూపాయల ఆదా చేయడంలో సహాయపడుతుందని సైతం ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంధన దిగుమతులను తగ్గించేందుకు ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. ఇంధన పొదుపు ప్రణాళికను తక్షణమే అమలు చేస్తున్నామని, మంత్రివర్గం దీన్ని పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.

Bharat Jodo Yatra: గడ్డకట్టే చలిలో చొక్కాలు విప్పేసి డాన్సులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు