పాకిస్థాన్: విదేశీ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. దీంతో అమెరికా, యూరప్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై దాడులకు దిగింది. జైషే మహమ్మద్ రక్షణ శిబిరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేలమట్టం చేయటం..పాక్ కూడా భారత సైనికుల శిబిరాలపై వరుస దాడులకు పాల్పడుతోంది. అంతటితో ఆపకుండా పాకిస్థాన్‌లోని ఎయిర్‌పోర్టులలోకి విదేశీ విమానాలు ప్రవేశించకుండా నిషేధించింది.
Read Also : ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు
ప్రస్తుతం ఈ నిషేధం ఫిబ్రవరి 28 వరకు ఉండగా..మరిన్ని రోజులు దీన్ని పొగించే పరిస్థితులు కనపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారత్, ఇతర దేశాలకు చెందిన విమానాలను నిషేధించడంతో అమెరికా, యూరప్ నుంచి ఇండియా..ఇండియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అమెరికా, యూరప్ నుంచి ఢిల్లీ వచ్చే విమానాలను అహ్మదాబాద్, ముంబాయి నుంచి వచ్చేలా రీరూట్ చేసిన్టటు ఓ అధికారి తెలిపారు.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి
యూఎస్, యూరప్ నుంచి ఇండియాకు వచ్చే విమానాలు టెక్నికల్ రిక్వైర్‌మెంట్స్ కారణంగా దుబాయి, షార్జాకు డైవర్ట్ చేసినట్టు అధికారి తెలిపారు. సాధారణంగా ఈ విమానాలు ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్ మీదుగా ఇండియా చేరుకునేవని..పాక్..ఇండియా సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఇటువంటి పరిస్థితి వచ్చిందనీ..అయినా తాము ఏ ఒక్క విమానాన్నీ రద్దు చేయడం లేదని..కేవలం ప్రయాణ సమయం మాత్రం మరింత పెరుగుతోందని సదరు అధికారు తెలిపారు. పాకిస్థాన్ నిర్ణయంతో అమెరికా, యూరప్, ఇండియా, సింగపూర్ ఇతర దేశాల్లో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాకిస్థాన్ మీదుగా వచ్చే..వెళ్లే విమానాలను వేరే దేశానికి డైవర్ట్ చేసి గమ్యస్థానాలకు చేరుకునేలా ఆయా విమాన సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి