Pakistan: పాకిస్తాన్‭లో రికార్డ్ స్థాయికి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఒక్క లీటర్ ఎంతో తెలుసా?

ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి దారిలోనే ఇతర నిత్యవసర ధరలు పెరగొచ్చట.

Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‭లో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా పెంపుతో చరిత్రలో ఎన్నడూ లేనంత రికార్డ్ స్థాయి ధరల్ని నమోదు చేసుకున్నాయి. ఆ దేశంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 272 పాకిస్తాన్ రూపాయలు కాగా, ఇక లీటర్ డీజిల్ ధర 280 పాకిస్తాన్ రూపాయలు ఉంది. ఇప్పటికే ధరల భారంతో అవస్తలు పడుతున్న పాకిస్తానీలు తాజా ఇంధన ధరలతో మరింత బెంబేలెత్తి పోతున్నారు.

Kanpur: భర్త, అత్తమామలకు డ్రగ్స్ ఇచ్చి నగలతో పరారైన పెళ్లికూతురు, ‘నేను నిన్ను ప్రేమించలేదు’ అంటూ మెసేజ్

షెహబాజ్ షరీప్ ప్రభుత్వం సప్లమెంటరీ ఫైనాన్స్ బిల్లును పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ముందు ఉంచిన గంటల వ్యవధిలోనే ఈ పెరుగుదల నామోదు కావడం గమనార్హం. ఆ బిల్లులో గూడ్స్ అండ్ సర్వీసు టాక్సును 18 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 170 బిలియన్ పాకిస్తాన్ రూపాయల ధనాన్ని సేకరించాలని షరీఫ్ ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక జీయో టీవి తెలిపిన వివరాల ప్రకారం.. తాజాగా డీజిల్ మీద 22.20 పాకిస్తాన్ రూపాయలు, పెట్రోల్ మీద 17 పాకిస్తాన్ రూపాయలు పెరగిందట. ఇక కిరోసిన్ మీద కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటర్ కిరోసిన్ 202.73 పాకిస్తాన్ రూపాయలు పలుకుతోంది.

Soldier Beaten to Death: డీఎంకే పార్టీ కౌన్సిలర్ దాడిలో గాయపడ్డ జవాన్ మృతి

కీలకమైన ద్రవ్య సహాయాన్ని విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి కొన్ని షరతులు విధించింది. అందులో భాగంగానే ఇంధన ధరల పెరుగుదల చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇది దేశంలో ద్రవ్యోల్బణంలో మరింత పెరుగుదలను ప్రేరేపిస్తుందని అంటున్నారు. ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి దారిలోనే ఇతర నిత్యవసర ధరలు పెరగొచ్చట.

ట్రెండింగ్ వార్తలు