Kanpur: భర్త, అత్తమామలకు డ్రగ్స్ ఇచ్చి నగలతో పరారైన పెళ్లికూతురు, ‘నేను నిన్ను ప్రేమించలేదు’ అంటూ మెసేజ్

ఇక పెళ్లి కూతురు సహా ఆమె ఇద్దరు స్నేహితులు డబ్బు, నగలు సర్దుకొని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారు. అయితే ఆ సమయంలోనే పెళ్లి కూతురు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లింది. తన భర్త మొబైల్ ఫోన్‭ను ‘‘నేను నిన్ను ప్రేమించలేదు, మళ్లీ నాకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయొద్దు’’ అని మెసేజ్ పంపింది.

Kanpur: భర్త, అత్తమామలకు డ్రగ్స్ ఇచ్చి నగలతో పరారైన పెళ్లికూతురు, ‘నేను నిన్ను ప్రేమించలేదు’ అంటూ మెసేజ్

Bride Drugs Groom, In-Laws on Train, Runs Away With Jewellery in Kanpur

Kanpur: పెళ్లి కూతరు సహా ఆమెకు సహాయంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని ప్రయాగ్‭రాజ్ రైల్వే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి డబ్బు, నగలు సహా ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నానరు. కొత్తగా పెళ్లైన ఆమె.. భర్త సహా అత్తమామలతో తీర్థయాత్రకు వెళ్తోంది. రైలులో ఉండగా వారికి డ్రగ్స్ ఇచ్చి నగలు, డబ్బుతో ఉడాయించిందని పోలీసులు విచారణ అనంతరం వెల్లడించారు.

Nikki Haley: భారత్ చుట్టూ అమెరికా ఎన్నికల ప్రచారం? అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. పెళ్లి కూతురు పేరు గుడియా. అంకిత్ అనే వ్యక్తిని ఫిబ్రవరి 6న చందౌలి జిల్లాలోని బలువాలో పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన రోజున నవ దంపతులు సహా వరుడి కుటుంబ సభ్యులు, వధువు బంధువు నగీనాతో కలిసి వారణాసికి సందర్శన కోసం బయలుదేరారు. అక్కడి నుంచి వారణాసి రైల్వే స్టేషన్‌ నుంచి అజ్మీర్‌కు రైలు ఎక్కారు. రైలు కాన్పూర్ సమీపంలో ఉండగా గుడియా మిత్రులంటూ చోటు, ఖట్కానా అనే ఇద్దరు వీరి ప్రయాణంలో తోడయ్యారు. చోటు కొన్ని పళ్లు ఇస్తే అందరూ తిన్నారు. అయితే అందులో అతడు డ్రగ్స్ కలిపాడు.

Odisha: మహిళా ఇన్‭స్పెక్టర్‭పై చెప్పుతో దాడి.. బీజేపీ సీనియర్ నేతపై కేసు నమోదు

అనంతరం వరుడు సహా మిగతా వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక పెళ్లి కూతురు సహా ఆమె ఇద్దరు స్నేహితులు డబ్బు, నగలు సర్దుకొని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారు. అయితే ఆ సమయంలోనే పెళ్లి కూతురు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లింది. తన భర్త మొబైల్ ఫోన్‭ను ‘‘నేను నిన్ను ప్రేమించలేదు, మళ్లీ నాకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయొద్దు’’ అని మెసేజ్ పంపింది. వరుడి కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించి కేసు నమోదు చేశారు. అనంతరం బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‭రాజ్ పోలీసులు స్పష్టం చేశారు.