Archana Jois : కెజిఎఫ్ లో హీరో తల్లి.. ఇప్పుడు హీరోయిన్ గా తెలుగు సినిమా..
తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరిగింది. (Archana Jois)
Archana Jois
Archana Jois : కెజిఎఫ్ సినిమాలో హీరో తల్లి పాత్రలో మెప్పించిన నటి అర్చనా జోయస్ ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. విజయ్ రాజ్ కుమార్ హీరోగా, అర్చనా జోయస్ హీరోయిన్ గా, అతిథి మైకల్ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎన్.ఎన్. కిషోర్ నిర్మాణంలో దివాకర్ యడ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరిగింది.
ఈ సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్ వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్, నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి, చీకోటి ప్రవీణ్ లు గెస్టులుగా హాజరయ్యారు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందచేయగా ముహూర్తం షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
Also Read : Vivek Chepuri : ‘కల్ట్’ లో విలన్ గా అందర్నీ భయపెట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఇప్పుడు హీరోగా ఎంట్రీ..
సినిమా ఓపెనింగ్ అనంతరం దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.. ప్రేమ అంటే రెండు మనసుల మధ్య పుట్టే అందమైన అనుభూతి. ఆ అనుభూతిని నిజాయతీగా, హృదయానికి హత్తుకునేలా తెరపై చూపించాలన్నదే మా ప్రయత్నం. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటారు. హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం అని తెలిపారు. నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ మాట్లాడుతూ.. సినిమా అంటే మాకు ప్రాణం. ఆ ప్రేమతోనే కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌ను ప్రారంభించాం. మంచి కథ, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే చిత్రాన్ని అందించడమే మా లక్ష్యం. దర్శకుడు దివాకర్ చెప్పిన కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మా బ్యానర్‌పై మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.

హీరో విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్. దర్శకుడు దివాకర్ మంచి కథను సిద్ధం చేశారు అని చెప్పారు. హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ.. కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించాను. కేజీయఫ్ సినిమాలో యశ్ తల్లిగా నటించడం నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాతో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
