Ramayanam : రామాయణం పార్ట్ 2 వాయిదా.. పార్ట్ 3 కూడా అనౌన్స్..
తాజాగా నిర్మాత ఓ ఇంటర్వ్యూలో పార్ట్ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Ramayanam)
Ramayanam
Ramayanam : రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా బాలీవుడ్ లో తెరకెక్కిన రామాయణం సినిమా నేడు రిలీజయింది. నమిత మల్హోత్రా నిర్మాణంలో నితీష్ తివేరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇప్పుడు రిలీజయింది పార్ట్ 1 మాత్రమే. ముందే ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
చెప్పినట్టే నేడు రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. తాజాగా నిర్మాత ఓ ఇంటర్వ్యూలో పార్ట్ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Dhanush : కావ్య–అనిరుధ్ పెళ్లికి ధనుష్ వస్తారా?
నమిత మల్హోత్రా మాట్లాడుతూ.. పార్ట్ 2 కేవలం 50 శాతం మాత్రమే షూటింగ్ అయింది. ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే పార్ట్ 3 కూడా అనుకుంటున్నాము అని తెలిపారు. ఇటీవల సాయి పల్లవి కూడా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా పార్ట్ 2 షూటింగ్ లో నేను జాయిన్ అవ్వలేదు అని తెలిపింది.
దీంతో రామాయణ సెకండ్ పార్ట్ 2028 కి వాయిదా పడుతుందని తెలుస్తుంది. 2027 దీపావళికి బదులు 2028 దీపావళికి రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే పార్ట్ 3 కూడా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. పార్ట్ 1 లో రావణుడు సీతను అపహరించుకోవడం, జటాయువు మరణంతో ఎండ్ చేసారు. దీంతో పార్ట్ 2 రాముడు – హనుమంతుడు సన్నివేశాలు, రామ రావణ యుద్ధం ఉంటుందని తెలుస్తుంది. ఇక పార్ట్ 3 లో రాముడు సీతతో అయోధ్యకు రావడం, సీత అడవులకు వెళ్లడం, లవ కుశుల గురించి, రామావతారం సమాప్తి గురించి ఉంటుందని తెలుస్తుంది.
