Odisha: మహిళా ఇన్‭స్పెక్టర్‭పై చెప్పుతో దాడి.. బీజేపీ సీనియర్ నేతపై కేసు నమోదు

ఆరోగ్య మంత్రి నాబా హత్య సందర్భంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రతిపక్ష నేత మిశ్రా సహా ఇతర బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ఘెరావ్ చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలోనే సంబల్‌పూర్ జిల్లా ధనుపాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ పై మిశ్రా దాడి చేసినట్లు తెలుస్తోంది.

Odisha: మహిళా ఇన్‭స్పెక్టర్‭పై చెప్పుతో దాడి.. బీజేపీ సీనియర్ నేతపై కేసు నమోదు

Odisha leader of Opposition booked for allegedly assaulting woman inspector

Odisha: మహిళా ఇన్‭స్పెక్టర్‭పై చెప్పుతో దాడి చేశారంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఒడిశా ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రాపై కేసు నమోదు అయింది. బుధవారం జరిగిన ఒక తగాదాలో ఆమెను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, ఆ సమయంలో ఆమె పట్ల మిశ్రా దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి నాబా హత్య సందర్భంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రతిపక్ష నేత మిశ్రా సహా ఇతర బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ఘెరావ్ చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలోనే సంబల్‌పూర్ జిల్లా ధనుపాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ (ఐఐసి) అనితా ప్రధాన్‌పై మిశ్రా దాడి చేసినట్లు తెలుస్తోంది.

Tripura Assembly Election 2023: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. పటిష్ఠ భద్రత మధ్య కొనసాగుతున్న ఓటింగ్

బీజేపీ కార్యకర్తల గుంపు కలెక్టర్ కార్యాలయం వైపు వెళ్లడంతో ఆమె పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించినట్లు ఇన్‌స్పెక్టర్ అనిత తెలిపారు. “ర్యాలీకి సంబంధించి నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇంతలో మా అధికారల గురించి ప్రశ్నించిన ఎమ్మెల్యేతో నేను ముఖాముఖికి వచ్చాను. అప్పుడు ఆయన నాపై దుర్భాషలాడడం ప్రారంభించారు. నేను సమాధానం చెప్తున్న క్రమంలోనే, ఎమ్మెల్యే నన్ను చెప్పుతో కొట్టి నెట్టివేశాను. ఒక్కసారిగా అవాక్కయ్యాను” అని ప్రధాన్ చెప్పారు. మిశ్రాపై ఇండియన్ పీనల్ కోడ్‭లోని 354, 353, 332, 294, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Nikki Haley: భారత్ చుట్టూ అమెరికా ఎన్నికల ప్రచారం? అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే మిశ్రా స్పందన ఇందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ మహిళా కార్యకర్తలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇది తెలిసి తాను పోలీసుల్ని ప్రశ్నించడానికి వెళ్తే తనను నెట్టి వేశారని ఆరోపించారు. ‘‘నువ్వు కూడా మహిళవే కదా అని ఆ ఇన్‌స్పెక్టర్‭ను నేను ప్రశ్నించాను. ఆమె అవినీతిలో చిక్కుకున్న పోలీస్ అధికారి కూడా. నాకు ఆమె సమాధానం చెప్పకపోగా, నన్నే తోసేసింది. ప్రతిపక్ష నేతను ఒక మహిళా ఇన్‌స్పెక్టర్ తోసేయడం ఏంటి? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఇదొక్క ఉదాహరణ చాలు’’ అని అన్నారు.