Khyber Pakhtunkhwa Attack: పాకిస్తాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి.. 15 మంది దుర్మరణం!

పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రభావిత ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌(Khyber Pakhtunkhwa Attack)లో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఘోర పేలుడు సంభవించి రక్తపాతం సృష్టించింది.

Pakistan khyber pakhtunkhwa blast kohat mosque attack

  • పాకిస్తాన్‌లో ఘోర పేలుడు
  • మసీదు వద్ద దాడి
  • 15 మంది మృతి

Khyber Pakhtunkhwa Attack: పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రభావిత ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌(Khyber Pakhtunkhwa Attack)లో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఘోర పేలుడు సంభవించి రక్తపాతం సృష్టించింది. కోహాట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న మసీదు వద్ద పేలుడు పదార్థాలు నింపిన ఒక వాహనం ప్రధాన గేటును వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. పేలుడు దాటికి మసీదు వెలుపలి గోడలు కూలిపోయి, భయంకరమైన గొయ్యి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు పోలీసు సిబ్బంది సహా 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలు కంపించిపోగా, అనంతరం కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.

AP Tidco Houses: ఏపీ పట్టణ పేదలకు ‘టిడ్కో ఇళ్లు’.. సర్కార్ సరికొత్త ప్లాన్.. త్వరలోనే పనులు ప్రారంభం

అత్యవసర పరిస్థితి విధింపు.. పెరుగుతున్న మృతుల సంఖ్య:

ఘటన సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే కోహాట్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించి, చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా బలగాల నీడలోకి తీసుకువచ్చారు. స్థానిక పోలీసులు ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించిన కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.