×
Ad

40 గంటల్లో 145 మంది మిలిటెంట్లను చంపేసిన పాకిస్థాన్ సైన్యం

ఈ హింసలో 31 మంది పౌరులు, 17 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించారు.

  • బలూచిస్థాన్‌లో పెరిగిన తిరుగుబాటు
  • ఖనిజ సంపదలో అధిక వాటా కోసం పోరాటం
  • బలూచ్‌లో హింస.. భారత్‌పై పాక్‌ ఆరోపణలు

Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రావిన్సులో 40 గంటల్లో 145 మంది మిలిటెంట్లను హతమార్చామని పాకిస్థాన్ ప్రకటించింది.

బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ హింసలో 31 మంది పౌరులు, 17 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించారని తెలిపారు.

Also Read: రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు.. వింతగా ప్రవర్తిస్తున్నారా?

గత సంవత్సరం నుంచి బలూచిస్థాన్‌లో తిరుగుబాటు కార్యకలాపాలు పెరిగాయి. ఈ దాడుల వల్ల దేశవ్యాప్తంగా 3,967 మరణాలు నమోదయ్యాయి.

అఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రావిన్సే బలూచిస్థాన్‌. ఈ ప్రావిన్స్‌లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉంటుంది. ఈ ప్రాంత వనరుల్లో అధిక వాటా తమకే కావాలని బలూచ్ జాతీయవాద గ్రూపులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

పాకిస్థాన్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వారాంతంలో ప్రావిన్సులోని అనేక జిల్లాల్లో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని నియంత్రించేందుకు సాయుధ దళాలు రంగంలోకి దిగాయి. బలూచిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల వెనుక భారత్‌ ఉందంటూ పాక్ సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆధారంలేని ఆరోపణలుగా భారత్ కొట్టివేసింది.