Memes on Parag: పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్.. మీమ్స్‌తో నెటిజెన్ల హల్చల్
పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించడం పట్ల నెట్టింట్లో మీమర్స్ హల్చల్ చేస్తున్నారు. ఎంత సీఈవో అయినా ప్రైవేటు ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటేనని, అందుకే ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలంటూ స్పందించారు. ఈ మీమ్స్ వేస్తున్నది దాదాపుగా భారతీయులే కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం చైనా మాజీ అధ్యక్షుడిని పార్టీ సమావేశం నుంచి బలవంతంగా బయటికి పంపేయడం లాంటి మీమ్స్ సైతం ఇందుకు ఉపయోగిస్తున్నారు
- tony bekkal
- Published on- October 28, 2022 / 03:09 PM IST
పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించడం పట్ల నెట్టింట్లో మీమర్స్ హల్చల్ చేస్తున్నారు. ఎంత సీఈవో అయినా ప్రైవేటు ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటేనని, అందుకే ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలంటూ స్పందించారు. ఈ మీమ్స్ వేస్తున్నది దాదాపుగా భారతీయులే కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం చైనా మాజీ అధ్యక్షుడిని పార్టీ సమావేశం నుంచి బలవంతంగా బయటికి పంపేయడం లాంటి మీమ్స్ సైతం ఇందుకు ఉపయోగిస్తున్నారు
Memes on Parag: ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్ట్‌ల అనంతరం.. ఎట్టకేలకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అయితే ట్విట్టర్ అలా చేతికి వచ్చిందో లేదో, ట్విట్టర్ సీఈవో, సీఎఫ్ఓ సహా అనేక మంది ఇతర ఉద్యోగులపై ఒకేసారి వేటు వేశారు. చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, ట్విటర్ పాలసీ హడ్ విజయా గద్దె సహా ఇతర ఉద్యోగుల్ని తొలగించారు. ట్విటర్ కొనుగోలుకు మస్క్ మొగ్గుచూపినప్పటి నుండే మస్క్ వీరిని పక్కకు తప్పించేందుకు చర్యలు మొదలు పెట్టారు. అంతేకాదు బహిరంగంగానే వెల్లడించాడు. దీంతో వీరిపై వేటు ముందే ఊహించిందే అయినా మస్క్ వీరిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించడం పట్ల నెట్టింట్లో మీమర్స్ హల్చల్ చేస్తున్నారు. ఎంత సీఈవో అయినా ప్రైవేటు ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటేనని, అందుకే ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలంటూ స్పందించారు. ఈ మీమ్స్ వేస్తున్నది దాదాపుగా భారతీయులే కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం చైనా మాజీ అధ్యక్షుడిని పార్టీ సమావేశం నుంచి బలవంతంగా బయటికి పంపేయడం లాంటి మీమ్స్ సైతం ఇందుకు ఉపయోగిస్తున్నారు. నెట్టింట హల్చల్ చేస్తున్న మీమ్స్‌లో కొన్ని మీకోసం..
