Elon Musk vs Vijaya Gadde: భారత సంతతికి చెందిన విజ‌యా గ‌ద్దె అంటే మ‌స్క్ కు ఎందుకంత కోపం.? ట‌్రంప్‌ విష‌యంలో జోక్య‌మే కార‌ణ‌మా..

విజ‌యా గ‌ద్దె భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ‌. 1974 సంవ‌త్స‌రంలో ఆమె హైద‌రాబాద్‌లో జ‌న్మించింది. అయితే ఆమెకు మూడేళ్ల వ‌య‌స్సులోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆమె బాల్యం నుంచి విద్యాభ్యాసం వ‌ర‌కు అన్నీ అక్క‌డే సాగాయి. 2011 సంవ‌త్స‌రంలో విజ‌యా గ‌ద్దె ట్విట‌ర్ లో అడుగుపెట్టారు.

Elon Musk vs Vijaya Gadde: భారత సంతతికి చెందిన విజ‌యా గ‌ద్దె అంటే మ‌స్క్ కు ఎందుకంత కోపం.? ట‌్రంప్‌ విష‌యంలో జోక్య‌మే కార‌ణ‌మా..

Elon Musk vs Vijaya Gadde

Elon Musk vs Vijaya Gadde: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థ‌ల సీఈవో ఎలాన్ మ‌స్క్ త‌న పంతాన్ని నెగ్గించుకున్నాడు. కొద్ది నెల‌లుగా ట్విట‌ర్ కొనుగోలు విష‌యంలో సందిగ్ద‌త‌కు తెర‌దించాడు. ట్విట‌ర్‌ను 44 బిలియ‌న్ డాల‌ర్ల ( సుమారు రూ.3.37 ల‌క్ష‌ల కోట్లు)కు కొనుగోలు చేసిన విష‌యం విధిత‌మే. కొనుగోలు ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే మ‌స్క్ భార‌త సంత‌తికి చెందిన ట్విట‌ర్ సీఈఓ ప‌రాగ్ అగ‌ర్వాల్‌, ట్విట‌ర్ పాల‌సీ హ‌డ్ విజ‌యా గ‌ద్దెను తొల‌గిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ట్విట‌ర్ కొనుగోలుకు మ‌స్క్ మొగ్గుచూపిన‌ప్ప‌టి నుండే మ‌స్క్ వీరిని ప‌క్క‌కు త‌ప్పించేందుకు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. అంతేకాదు బ‌హిరంగంగానే వెల్ల‌డించాడు. దీంతో వీరిపై వేటు ముందే ఊహించిందే అయినా మస్క్ వీరిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది. అసలు విజయా గద్దె ఎవరు? ఈమె పేరు వింటేనే మస్క్‌కు ఎందుకంత కోపం అనే విష‌యాలు ట్విట‌ర్‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తీఒక్క‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి.

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

విజ‌యాగ‌ద్దె భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ‌. 1974 సంవ‌త్స‌రంలో ఆమె హైద‌రాబాద్‌లో జ‌న్మించింది. అయితే ఆమెకు మూడేళ్ల వ‌య‌స్సులోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆమె బాల్యం నుంచి విద్యాభ్యాసం వ‌ర‌కు అన్నీ అక్క‌డే సాగాయి. ఆమె ట్విట‌ర్ లోకి అడుగుపెట్ట‌క ముందు న్యాయ‌వాదిగా కొన‌సాగారు. 2011 సంవ‌త్స‌రంలో ట్విట‌ర్ లో అడుగుపెట్టారు. విజ‌యా గ‌ద్దె తన పనితీరుతో ట్విట‌ర్‌లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ట్విట‌ర్ లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్‌ విభాగాధిపతిగా నియామ‌క‌మైయ్యారు. దీంతో ఆమె ట్విట‌ర్‌లో తీసుకొనే ప్ర‌తీకీల‌క నిర్ణ‌యంలోనూ భాగ‌స్వాములుగా ఉంటూవ‌చ్చారు. ట్విట‌ర్‌లో ద్వేషపూరిత ప్రకటనలు, ట్వీట్లు, వేధింపులు, తప్పుడు సమాచారం, విద్వేష స్పీచ్‌లను ట్విట్టర్‌లో నియంత్రించడంలో ఈమె కీల‌క భూమిక పోషించారు. ఈ క్ర‌మ‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట‌ర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేయడంలో విజ‌యా గ‌ద్దె కీలక భూమిక పోషించార‌ని ప్ర‌చారంలో ఉంది.

Elon Musk: ట్విట్టర్ కొనుగోలు డబ్బు సంపాదించడం కోసం కాదట. ఎందుకో వెల్లడించిన ఎలాన్ మస్క్

ట్విట‌ర్ వేదిక‌గా విద్వేష‌పూరిత ప్ర‌సంగం చేసినందుకు అప్ప‌ట్లో అమెరికా అధ్య‌క్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను ట్విట‌ర్ నుంచి శాశ్వ‌తంగా తొల‌గించిన విష‌యం విధిత‌మే. ఈ చర్యను అప్ప‌ట్లో ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు. దీంతో అప్ప‌టి నుంచి భార‌త సంత‌తికి చెందిన ప‌రాగ్ అగ‌ర్వాల్‌, విజ‌యా గ‌ద్దెల‌పై మ‌స్క్ వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ అత్య‌ధిక ధ‌నవంతుల్లో ఒక్క‌రిగా ఉన్న మ‌స్క్ ట్విట‌ర్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపాడు. అప్ప‌టి నుంచి మ‌స్క్ ట్విట‌ర్ ను కొనుగోలు చేస్తే వీరిని ప‌క్క‌కు త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. అంతేకాదు మ‌స్క్ సైతం అగ‌ర్వాల్‌, విజ‌యా గ‌ద్దెల‌ను తొల‌గిస్తానంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తూ వ‌చ్చాడు.

Elon Musk: గెట్ రెడీ.. బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ గురించి వెల్లడించనున్న ఎలన్ మస్క్

తాజాగా మ‌స్క్ ట్విట‌ర్ ను త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్న కొద్ది గంట‌ల‌కే వారిద్ద‌రిని విధుల నుంచి తొల‌గిస్తూ ప్ర‌క‌టించాడు. ఇప్పుడు మ‌స్క్ మాజీ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ట్విట‌ర్‌లోకి ఆహ్వానించే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. యుఎస్ క్యాపిటల్‌పై దాడి తర్వాత తొలగించబడిన డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధాన్ని వెనక్కి తీసుకుంటానని మే నెల‌లో ట్విట‌ర్ కొనుగోలుకు సిద్ధ‌మైన ఎలాన్‌ మస్క్ చెప్పారు. అయినప్పటికీ అతను ప్లాట్‌ఫారమ్‌పైకి తిరిగి రాలేనని ట్రంప్ బ‌దిలిచ్చాడు. అంతేకాదు ట్విట‌ర్‌కు బ‌దులుగా సొంతంగా యాప్ ట్రూత్ సోషల్‌ను ట్రంప్ ప్రారంభించాడు. ఇటీవ‌ల యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లోకి కూడా అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ట్రంప్ మ‌రోసారి ట్విట‌ర్ లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.