Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేశాడు. ఈ ఒప్పందం పూర్తికాగానే, కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగుల్ని తొలగించాడు.

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

Elon Musk: ఎట్టకేలకు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తైనట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. 44 బిలియన్ డాలర్ల (రూ.3.60 లక్షల కోట్లు)తో ఎలన్ మస్క్ ఈ డీల్ పూర్తి చేశాడు.

Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సొంతం చేసుకుంటాం.. రాజ్‌నాథ్ సింగ్

ట్విట్టర్ తన సొంతం కాగానే, ఎలన్ మస్క్ తనదైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా ట్విట్టర్ సంస్థలో కీలకంగా ఉన్న కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తొలగించాడు. సీఈవో పరాగ్ అగర్వాల్‌తోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెతోపాటు మరికొందరిని ఉద్యోగంలోంచి తొలగించాడు. వీరిలో కొందరిపై ఎలన్ మస్క్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఫేక్ అకౌంట్లు, కంపెనీకి సంబంధించిన ఇతర అంశాల్లో తనకు తప్పుడు సమాచారం అందించారని ఎలన్ మస్క్ ఆరోపించాడు. ఉద్యోగంలోంచి తొలగించిన వారిలో నెడ్ సెగల్.. చివరి రోజు కంపెనీలోనే ఉన్నాడు. ఈ డీల్ కుదిరే చివరి క్షణం వరకు అక్కడే ఉన్నాడు. అనంతరం కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. కాగా, మరికొందరు ఉద్యోగుల్ని కూడా తొలగించే యోచనలో ఉన్నాడు ఎలన్ మస్క్.

Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగుల్ని తగ్గించాలనుకుంటున్నాడు. భవిష్యత్తులోనూ ఎలన్ మస్క్ కంపెనీలో పలు మార్పులు చేయబోతున్నాడు. ట్విట్టర్ తన సొంతమైన సందర్భంగా ఎలన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్‌లో చీఫ్ ట్విట్టర్ అని పేర్కొన్నాడు. కాగా, తాను డబ్బు సంపాదన కోసం ఈ సంస్థను కొనుక్కోలేదని, మానవత్వాన్ని పెంచేందుకే ట్విట్టర్ కొనుగోలు చేశానని పేర్కొన్నాడు.