Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సొంతం చేసుకుంటాం.. రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సొంతం చేసుకుంటాం.. రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌ను భారత్ సొంతం చేసుకుంటుందని చెప్పారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఇండియాకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది.

Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌లోని ప్రజలపై అనేక అరాచకాలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ పాల్పడే ప్రతీ చర్యకు తగిన పరిణామాల్ని ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జమ్ము-కాశ్మీర్, లదాఖ్‌లో అనుకున్న లక్ష్యాల్ని సాధించే దిశగా సాగుతున్నాం. అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. గిల్గిత్-బాలిస్తాన్ చేరినప్పుడే మన లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది. అదంతా సైనిక బలగాల వల్లే సాధ్యమవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలు పడుతున్న బాధని గమనిస్తున్నాం. పీఓకేను స్వాధీనం చేసుకునేదాకా మన ప్రయాణం ఆగదు. తీవ్రవాదానికి మతం లేదు. తీవ్రవాదుల లక్ష్యం ఇండియాపై దాడి చేయడమే.

ACB Court : ఆ ముగ్గురు నిందితులను వెంటనే విడుదల చేయండి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్

జమ్ము-కాశ్మీర్‌లో కొనసాగుతున్న వివక్షను తొలగించింది మోదీయే. ఆయన ఆగష్టు 5, 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. పాకిస్తాన్ మన దేశంలో మానవ హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.