Elon Musk: ట్విట్టర్ కొనుగోలు డబ్బు సంపాదించడం కోసం కాదట. ఎందుకో వెల్లడించిన ఎలాన్ మస్క్

డబ్బు కోసం సంప్రదాయ మీడియా అనేక విపరీతాలకు ఆజ్యం పోసింది. కనికరం లేకుండా వడ్డి వారించే అలాంటి కంటెంట్ ద్వారానే డబ్బులు వస్తాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల ఉత్తమమైన చర్చకు అవకాశం లేకుండా పోతోంది. నేనేదో డబ్బులు సంపాదించడానికి ట్విట్టర్ కొనుగోలు చేయడం లేదు. మానవాళికి ప్రేమను, మానవత్వాన్ని పంచే ప్రయత్నంలో భాగంగా కొంటున్నాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను కూడా మానవత్వంతో వీలైనంత ప్రయత్నం చేస్తాను.

Elon Musk: ట్విట్టర్ కొనుగోలు డబ్బు సంపాదించడం కోసం కాదట. ఎందుకో వెల్లడించిన ఎలాన్ మస్క్

I didn't buy Twitter to make money, bought it to help humanity says Musk

Elon Musk: అనేక వివాదాల అనంతరం ఎట్టకేలకు ట్విట్టర్ కొనుగోలుపై బుధవారం క్లారిటీ ఇచ్చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో చేతిలో బాత్రూం సింక్‭తో ఆఫీసు ఏర్పాట్లు చేస్తున్న తన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలోనే షేర్ చేశారు. ‘‘ట్విట్టర్ కేంద్ర కార్యాలయంలోకి చేరుకున్నాను’’ అంటూ ఆ వీడియోకు ఓ ట్వీట్ జత చేశారు. అయితే తాను ట్విట్టర్ ఎందుకు కొంటున్నానో వెల్లడించారు మస్క్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన.. అధనంగా డబ్బులు సంపాదించడం కోసం ట్విట్టర్ కొనుగోలు చేయడం లేదని, మానవత్వాన్ని వ్యాప్తి చేసేందుకు కొంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై తన ట్విట్టర్ ఖాతాలో ఒక నోట్ షేర్ చేశారు మస్క్.

‘‘ట్విట్టర్‌ని కొనుగోలు చేయడంలో నా ఆసక్తిని మీతో వ్యక్తిగతంగా పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ట్విట్టర్ కొనుగోలు చేయడం పట్ల చాలా ఊహాగాణాలు, చాలా విశ్లేషణలు, చాలా అంచనాలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. నిజానికి అవన్నీ తప్పు. ఒక సాధారణ డిజిటల్ టౌన్ స్క్వేర్ ఉండడం అనేది ప్రస్తుత నాగరిక సమాజానికి చాలా ముఖ్యం. ఎలాంటి హింసను ఆశ్రయించకుండా, అనేక రకాల నమ్మకాలను, భావజాలాలను ఆరోగ్యకరమైన పద్దతిలో చర్చించే వీలు ఉండాలి.

డబ్బు కోసం సంప్రదాయ మీడియా అనేక విపరీతాలకు ఆజ్యం పోసింది. కనికరం లేకుండా వడ్డి వారించే అలాంటి కంటెంట్ ద్వారానే డబ్బులు వస్తాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల ఉత్తమమైన చర్చకు అవకాశం లేకుండా పోతోంది. నేనేదో డబ్బులు సంపాదించడానికి ట్విట్టర్ కొనుగోలు చేయడం లేదు. మానవాళికి ప్రేమను, మానవత్వాన్ని పంచే ప్రయత్నంలో భాగంగా కొంటున్నాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను కూడా మానవత్వంతో వీలైనంత ప్రయత్నం చేస్తాను. కానీ అది ఎంత వరకు చేరుతుందని కాలమే సమాధానం చెప్తుంది.

ఈ వేదిక కొందరికి మాత్రమే పరిమితం కాదు, అలా అని ఏ ఒక్కరికి దూరం కాదు. అన్ని భావజాలాలు, అన్ని అభిప్రాయాలు ఇక్కడ చర్చకు వస్తాయి, రావాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అభిప్రాయానికి స్వాగతం. సినిమాలు, కళలు, ఇతర అంశాలు.. వేటి గురించైనా స్వేచ్ఛగా చర్చించుకునే వీలు ఇక్కడ ఉంటుంది. అంతే కాకుండా ప్రకటనలకు కూడా ఇది అత్యుత్తమమైన వేదిక. ఈ విషయంలో అన్ని సోషల్ మీడియా వేదికల్లో ట్విట్టర్ చాలా ప్రాముఖ్యత, విశ్వాసం, గౌరవం ఉన్న వేదిక. దాన్ని కొనసాగిస్తాం’’ అని మస్క్ ట్వీట్ చేశారు. తనతో పాటు ట్విట్టర్ భాగస్వామ్యంలో ఉన్నవారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అసాధారణమనేదాన్ని మనమంతా కలిసి నిర్మించుకుందాం పదండని చివరిలో రాసుకొచ్చారు.

Currency Notes: సరికొత్త వివాదానికి తెరలేపిన కేజ్రీవాల్ వ్యాఖ్యలు.. కరెన్సీ నోట్లపై అంబేద్కర్, మోదీ ఫొటోలు వేయాలంటూ డిమాండ్లు