Mariupol: ఉక్రెయిన్‌లోని మారియుపోల్ నగరంలో ప్రజలు సోమవారం రష్యా దినోత్సవాన్ని జరుపుకున్నారని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. అనేక అధికారిక, నివాస భవనాలపై రష్యన్ జెండాలను ఎగరేస్తున్న వీడియోను హిందుస్తాన్ టైమ్స్ షేర్ చేసంది. అనేక మంది మారియుపోల్ నివాసితులు కూడా తమ కార్లలో రష్యన్ జెండాలను మోసుకెళ్లారు. ఉక్రెయిన్‌లో కీలకమైన ఓడరేవు నగరమైన మరియుపోల్‌ను గత ఏడాది నవంబర్‌లో రష్యన్ ఫెడరేషన్ తన ఆధీనంలోకి తీసుకుంది.
Amit Shah and Prabhas: రాజమౌళి, ప్రభాస్‌తో భేటీకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా?
రష్యన్ జాతీయవాద యూత్ మూవ్‌మెంట్ సభ్యులు మరియుపోల్ సిటీ సెంటర్‌లో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో రష్యా జెండాలు రెపరెపలాడుతుండగా ‘మా గొప్ప మాతృభూమి’ అంటూ నినాదాలు వినిపించాయి. మరియూపోల్ నగరంలో రష్యన్ పరిపాలన కనిపించేలా కొన్ని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయట. వీటిని రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలం నాటి పునర్నిర్మాణ పనులతో అధికారులు పోల్చారు. ఒకవైపు మారియుపోల్ నగరంలో రష్యా డే ఉత్సవాలు జరుగుతున్నాయి, మరొకవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సాగుతూనే ఉంది.