strange creature : అమరిల్లో సిటీలో వింత ఆకారం.. అంతుచిక్కని మిస్టరీ..
సీసీ కెమెరాల్లో రకరకాల వింత జీవులు కనిపించాయనే వార్తలు వింటూ ఉంటాం. కొన్న కథనాలు భయపెడుతూ ఉంటాయి. అమరిల్లో జూ సీసీ కెమెరాలో కనిపించిన వింత జీవి కథ ఇప్పటికీ అంతుపట్టలేదు సరికదా.. అక్కడి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
- Lakshmi 10tv
- Published On : April 18, 2023 / 12:45 PM IST
strange creature
strange creature : ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. ఆకాశంలో, అడవుల్లో ఎన్నో అంతుపట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్నిటిని ఛేదించగలిగినా.. కొన్నిమిస్టరీలుగా మిగిలిపోయాయి. తాజాగా ఓ సిటీలో కనిపించిన వింత జీవి (strange creature) జనాల్ని భయభ్రాంతులకు గురి చేసింది.
Clocks Gift from God : వింత ఆచారం..సిగరెట్ వెలిగిస్తే ఈ దేవుడు కోరికలు తీరుస్తాడట..!!
గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్ సాసర్‌లు, వింతజీవుల కథలు మనం వింటూ వచ్చాం.. కొన్ని వింత జీవులు కనిపించాయనే వార్తలు విన్నాం. గతేడాది మే 21 న అమరిల్లో (amarillo) సిటీలో ఓ వింత జీవి కెమెరాకు చిక్కింది. తెల్లవారు ఝామున ఓ జూ మెటల్ ఫెన్సింగ్ (metal fencing) వెనుక ఈ జీవిని సీసీ కెమెరాలు బంధించాయి. తల భాగం జంతువులా.. మిగతా భాగం మనిషిని పోలిన ఈ వింత జీవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వింత జీవి గురించి ఎంతో విచారణ జరిపిన అధికారులు కనిపెట్టలేక చివరికి ప్రజల సహకారాన్ని కూడా అర్ధించారు. అయినా ఇప్పటివరకూ దీని గురించి ఏ విషయం తెలియలేదు. కానీ ఇప్పటికీ ఈ వింతజీవి గురించి జనం భయపడుతూనే ఉన్నారు.
Shocking : 24,000 ఏళ్లుగా మంచులోనే బతికే ఉన్న వింత జీవి..!
వింతజీవికి సంబంధించిన ఫోటోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. అమెరికా జానపద కథల్లో కనపడిన జీవి ఆకారంలో ఉందని కొందరు జనాలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వింతజీవి మిస్టరీ వీడితే కానీ దీని గురించి చర్చకు తెర పడదు.
