Chandrayaan-3: ఆదిత్య ఎల్-1 విజయవంతం కాగానే మరో గుడ్ న్యూస్.. చంద్రుడిపై సెంచరీ కొట్టిన చంద్రయాన్-3

రోవర్‌, ల్యాండర్‌లను రాత్రికి రాత్రే ఎదుర్కోవాల్సి ఉన్నందున వాటిని స్లీప్‌ మోడ్‌లోకి మార్చే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు

Chandrayaan-3 Mission: ఇస్రోకి శనివారం చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు దేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. మరోవైపు, చంద్రయాన్ 3కి చెందిన రోవర్ కూడా శనివారం చంద్రునిపై ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది. చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్ల వరకు ప్రయాణించిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. అంతటితో ఆగకుండా మరింత ముందుకు సాగుతున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.

Elon Musk daughter: నేను ట్రాన్స్‌జెండర్‌ని.. ఈ విషయం నాన్నకు చెప్పకు: ఎలాన్ మస్క్ కూతురు

చంద్రయాన్ 3 రోవర్ విజయంపై ఇస్రో ఎక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘‘చంద్రయాన్ 3 మిషన్, ప్రజ్ఞాన్ 100*’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. ఇక అంచనాలను దాటి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఇప్పటివరకు 100 మీటర్ల దూరం ప్రయాణించి ఇంకా ముందుకు సాగుతుండడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.

Aditya-L1: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుని ఎంత దగ్గరగా వెళ్తుంది? ఇంతకీ ఆ మిషన్ చేసే పనేంటి?

రోవర్, ల్యాండర్‌లను “స్లీప్ మోడ్”లోకి మార్చే ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. రోవర్‌, ల్యాండర్‌లను రాత్రికి రాత్రే ఎదుర్కోవాల్సి ఉన్నందున వాటిని స్లీప్‌ మోడ్‌లోకి మార్చే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో, భారతదేశం అంతరిక్ష ప్రయోగాలను ప్రైవేటీకరించింది. వచ్చే దశాబ్దంలో ప్రపంచ ప్రయోగ మార్కెట్‌లో తన వాటాను ఐదు రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున విదేశీ పెట్టుబడులకు ఈ రంగాన్ని తెరవాలనుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు