Imran Khan Arrest: ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్‭లోకి దూసుకెళ్లి బీభత్సం చేసిన నిరసనకారులు

ఇమ్రాన్ అరెస్టు అయిన కొద్ది సమయానికే దేశ వ్యాప్తంగా నిరసనలు చెరేగాయి. ఇమ్రాన్ అరెస్టును కిడ్నాప్ కింద వర్ణించింది ఆయన పార్టీ పీటీఐ. కోర్టు ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రిని అపహరించారంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది

Imran Khan Arrest: మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. లాహోర్, పెషావర్, కరాచీ, గిల్గిట్, కరక్ సహా నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ మద్దతుదారులు కొందరు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ (పాకిస్తాన్ ఆర్మీ)లోకి ప్రవేశించగా, మరికొందరు లాహోర్ కార్ప్స్ కమాండర్ నివాసంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు.


ఇమ్రాన్ అరెస్టు అయిన కొద్ది సమయానికే దేశ వ్యాప్తంగా నిరసనలు చెరేగాయి. ఇమ్రాన్ అరెస్టును కిడ్నాప్ కింద వర్ణించింది ఆయన పార్టీ పీటీఐ. కోర్టు ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రిని అపహరించారంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్ ఫరూక్ మంగళవారం ఐహెచ్‌సి ప్రాంగణంలో అరెస్టు చేసేందుకు అనుమతి ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలోనే పోలీసులకు, పీటీఐ కార్యకర్తలకు మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది.


ఇమ్రాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఈ చర్యలో అనేక మంది గాయపడ్డారు. అనంతరం పోలీసులపై పీటీఐ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అనేక మంది న్యాయవాదులు, సాధారణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. విదేశాల నుంచి ఇమ్రాన్ అందుకున్న ఖరీదైన బహుమతులను లాభాల కోసం విక్రయించారని బలమైన ఆరోపణల నేపథ్యంలో తాజా అరెస్ట్ చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు