×
Ad

పుతిన్ కారు ఫీచర్స్, సెక్యూరిటీ వావ్.. అప్పట్లో మోదీ కూడా ఈ కారులో జర్నీ..

రష్యా అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా వాహనం బుల్లెట్‌ప్రూఫ్‌తో పాటు బాంబు దాడులను తట్టుకునే రక్షణతో ఉంటుంది.

Vladimir Putin

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుతిన్‌ విదేశాలకు వెళ్లినప్పుడు సుమారు 100 మంది భద్రతా అధికారులు ఆయన వెంట ఉంటారు. భారత్‌ పర్యటన కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన ఆర్మర్డ్‌ ఔరస్‌ సెనాట్‌ లిమోసిన్‌ను ప్రత్యేకంగా విమానంలో తీసుకువస్తారు.

అది రష్యా అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా వాహనం. ఇది బుల్లెట్‌ప్రూఫ్‌తో పాటు బాంబు దాడులను తట్టుకునే రక్షణతో ఉంటుంది. ఈ వాహనం అత్యంత తీవ్ర దాడులను తట్టుకునేలా ఉంటుంది. పుతిన్‌ భద్రతా వ్యవస్థలో భాగంగా ఆయన ఢిల్లీకి రాకముందే స్థానికంగా రష్యా టీమ్స్‌ ఉంటాయి. (Vladimir Putin)

పోర్టబుల్‌ టాయిలెట్‌
మరోవైపు, పుతిన్‌ విదేశీ పర్యటనల్లో పోర్టబుల్‌ టాయిలెట్‌ను కూడా తీసుకువెళ్తారు. రష్యా భద్రతా ప్రొటోకాల్స్‌ తెలిసిన వారు తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్‌ జీవ అవశేషాలు ఏవీ ఇతర దేశాల్లో ఉండకుండా చూస్తారు.

ఇలాంటి పదార్థం ఇతర దేశాలకు చిక్కితే ఆయన ఆరోగ్యంపై సమాచారం ఆ దేశాలకు తెలిసిపోతుంది. దాన్ని పరీక్షించి చూసి ఏయే అనారోగ్యాలు ఉన్నాయో పసిగట్టేస్తారు. పుతిన్‌ జీవ అవశేషాలు ఏవీ ఇతర దేశాల్లో ఉండకుండా చేసే పద్ధతిని జాతీయ భద్రతా చర్యగా భావిస్తారు.

పుతిన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా మన దేశ భద్రతా యంత్రాంగం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. రష్యా అధికారులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. భారత సంస్థల సమన్వయంతో రష్యా అధికారులు పుతిన్‌ పర్యటపై అన్ని చర్యలు తీసుకుంటున్నారు.